విశాఖ స్టూడియో..మాది..మా స్వంతం

విశాఖలో రామానాయుడు స్టూడియో తమ స్వంతమని, దాని వ్యవహారాలు అన్నీ తమ వ్యక్తిగత వ్యవహారాలు అని దాని అధినేత సురేష్ బాబు అన్నారు. ఆయన గ్రేట్ ఆంధ్ర కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై…

విశాఖలో రామానాయుడు స్టూడియో తమ స్వంతమని, దాని వ్యవహారాలు అన్నీ తమ వ్యక్తిగత వ్యవహారాలు అని దాని అధినేత సురేష్ బాబు అన్నారు. ఆయన గ్రేట్ ఆంధ్ర కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

పత్రికల్లో ఏవో వార్తలు వచ్చాయని, అవన్నీ తాను పట్టించుకోనని, అయితే విశాఖలో స్టూడియో అన్నది తన తండ్రి కల అని ఆయన అన్నారు.

ఆ రోజుల్లో వున్న మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధర ఇచ్చి మరీ ప్రభుత్వం దగ్గర స్థలం కోనుగోలు చేసామని, అందులో సినిమా ఇంకా వినోదం కు సంబందించిన ఏ వ్యాపారమైన చేసుకునే హక్కు తమకు వుందని ఆయన స్పష్టం చేసారు. అవసరం అయితే అదే తరహా వ్యాపారం చేసుకునేవారికి అమ్మే హక్కు కూడా వుందన్నారు. 

తమకు ప్రభుత్వంతో ఏ గొడవా లేదని, అసలు తాను ఎవరితోనూ గొడవ పడనని సురేష్ బాబు చెప్పారు.