మంచు మోహన్‌బాబుకు ఉన్న ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన విష్ణు ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి మనోజ్ చిత్రాల పరంపర మొదలైంది. ఇప్పటిదాకా విష్ణు రెండు మూడు హిట్లు చవిచూడగా.. మనోజ్ మాత్రం.. ఇంకా తొలి ఘన విజయం కోసం నానా పాట్లు పడుతూనే ఉన్నాడు. విష్ణు చిత్రాలు సాధారణ ఫార్మాట్లో ఉంటుండగా.. మనోజ్ చిత్రాలు మాత్రం ఒక రకమైన అతివాద ధోరణిని ప్రేక్షకులకు రుచిచూపిస్తుంటాయి. కథ` పాత్ర చిత్రీకరణ ఎలాంటిది అయినప్పటికీ.. దానిని తాను పోషించే తీరుతో వాటిని అతివాద ధోరణికి తీసుకెళ్లిపోతూంటాడు మనోజ్.
అయితే సక్సెస్‌లో కంపేరిటివ్‌గా అన్నయ్యకే ఉన్నాయి గానీ.. దర్శకులు మాత్రం తమ్ముడిలో ఉన్న ఎనర్జీ అన్నయ్యలో లేదని ఫీలవుతున్నట్లుగా ఉంది. తాజాగా విష్ణుతో ఒక సినిమా పూర్తిచేసి, తర్వాతి సినిమాను మనోజ్ చేయడానికి రెడీ అవుతున్న వీరు పోట్ల మాత్రం అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నాడు.
సాధారణంగా ఎవరైనా సరే గొప్ప వారితో పోల్చి వారికి తీసిపోకుండా నటించారని వ్యాఖ్యానిస్తుండం కద్దు. అయితే… విష్ణును తనకంటె తక్కువ పెర్ఫార్మెన్స్ మరియు హిట్ రికార్డు కలిగి ఉన్న తమ్ముడు మనోజ్‌తో పోలుస్తూ.. మనోజ్‌కు ఏమాత్రం తీసిపోకుండా విష్ణు కూడా నటించారు అని వ్యాఖ్యానించడం తమాషాగా ఉంది. దూసుకెళ్తా సినిమా విడుదలైపోయి.. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఇలాంటి సమయంలో వీరుపోట్ల ప్రెస్‌మీట్ పెట్టి.. ఇది తాను మనోజ్‌కోసం తయారుచేసుకున్న కథ అని, అయితే విష్ణుతో చేయమంటే చేశానని` మనోజ్ అంత ఎనర్జిటిగ్గా విష్ణు ఉండడేమో అని సందేహించినప్పటికీ తను బాగానే ప్రూవ్ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇలా చెప్పడం ద్వారా విష్ణును కూడా పొగుడుతున్నానని వీరూ అనుకున్నాడో ఏమో గానీ.. మొత్తానికి ఈ వ్యాఖ్యలు చాలా డ్యామేజింగ్గానే ఉన్నాయి. విష్ణు పరువు తీసేలా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.