‘అత్తారింటికి దారేది’తో తక కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకొంది ప్రణీత. దాంతో ఆఫర్లు చుట్టు ముట్టేస్తాయి.. ఇక కాల్షీట్లు సర్దుబాటు చేసుకొంటూ కూర్చోవడమే తరువాయి.. అనుకొన్నారంతా. ‘గబ్బర్ సింగ్`2’లో ప్రణీతే కథానాయిక అన్నారు. అయితే ప్రణీతకు ఇంకా పిలుపు రాలేదు. అంతే కాదు.. కొత్తగా తెలుగులో ప్రణీత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు.
’’ఈ విజయాన్ని పదిలంగా కాపాడుకోవాలనుకొంటున్నా. విజయాన్ని సొమ్ము చేసుకోవాలనే తొందర లేదు. అందుకే కాస్త ఓపిక పడుతున్నా’’ అని చెబుతోందిగానీ.. లోలోపల మాత్రం బోలెడన్ని భయాలున్నాయి. ‘అత్తారింటికి దారేది’ విజయం పవన్ మ్యాజిక్కే అని అందరికీ తెలుసు. ఆ సినిమాలో ప్రణీత కొత్తగా చేసింది, గ్లామర్‌ని గుమ్మరించిందీ ఏవిూ లేదు. అందుకే ప్రణీత ఎవరి దృష్టిలో పడలేకపోయింది. ఓ మాదిరి సినిమాల్ని అస్సలు ఒప్పుకోవడం లేదట. పెద్ద స్టార్లు పిలుస్తారు… అని కాచుకొని కూర్చుంది.
చిన్నదో.. పెద్దదో.. అవకాశాలు వచ్చినా కాదనుకోవడం ప్రణీత తెలివితక్కువ తనమే. ఎందుకంటే వేడివిూద ఉన్నప్పుడే ఆరగించాలి. వెలుగులున్నప్పుడే.. ఆకట్టుకోవాలి. ఈ సంగతి ఆమెకు ఎప్పుడు అర్థమవుతుందో..?