వెంకటేష్ కే కాదు.. దాదాపు సీనియర్ హీరోలందరికీ పెద్ద సమస్య వచ్చి పడింది. అదే కథానాయికల కొరత. నిన్నా మొన్నటి వరకూ బాలయ్య పక్కన హీరోయిన్ ఎవరనే దానిపై పెద్ద చర్చసాగింది. ఎవరెవరో వచ్చారు, వెళ్లారు. ఇక్కడి వాళ్లయితే లాభం లేదని.. ముంబై నుంచి ఓ భామని దిగుమతి చేశారు. తెలుగులో అంత గుర్తింపు లేని రాధికా ఆప్టేని కథానాయిక చేసేశారు.
ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ వెంకటేష్‌నీ పీడిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి అంజలి దొరికింది కాబట్టి సరిపోయింది గానీ. లేదంటే… ఆ అన్వేషణ ఇప్పటి వరకూ కొనసాగేదే. ‘మసాలా’ కోసం కూడా వెదికీ వెదికి చివరికి మళ్లీ అంజలినే నమ్ముకొన్నారు.
ఇప్పుడు ‘త్రయం’ సినిమాకీ అదే సమస్య. ఈ సినిమాలో వెంకీ పక్కన కథానాయిక ఎవరో ఇప్పటికీ తేలడం లేదు. నయనతారను అనుకొన్నా.. ఆమె కాల్షీట్లు ఇప్పటికీ ఖరారు కాలేదు. సమస్య.. వెంకీ పక్కన నటించడం కాదు. అదే సినిమాలో ఉన్న మరో హీరోకి వదినో, పిన్నో అయిపోవడమే. ‘త్రయం’లో రామ్‌చరణ్ బాబాయ్‌గా వెంకీ కనిపిస్తారట. అంటే వచ్చే కథానాయిక ఎవరైనా సరే, రామ్‌చరణ్‌కి పిన్ని అవుతుంది. అందుకే నయనతార ఈ సినిమాని లైట్ తీసుకొంటోందట.
అలా ‘త్రయం’కి కథానాయిక ఎంపిక పెద్ద సమస్య అయిపోయింది. మళ్లీ అంజలిని పెట్టుకొంటే రొటీన్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నారుగానీ, ప్రస్తుతానికి అంతకు మించిన ఆప్షన్ దొరకడం లేదు. మరి ఏం చేస్తారో ఏమిటో…?