నిర్మాత పివిపి తమిళ సినిమా ఓ మై కడవులే ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోగా విష్వక్ సేన్ ను తీసుకున్నారు. ముందు అంతగా మొగ్గు చూపకున్నా, ఆఖరికి విష్వక్ సేన్ ఓకె అన్నారు. ఇందుకు గాను కోటిన్నర రెమ్యూనిరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెండు కోట్లు అడిగినట్లు, ఆఖరికి కోటిన్నర దగ్గర సెటిల్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విష్వక్ సేన్ చేతిలో హిట్ 2, పాగల్ సినిమాలు వున్నాయి. ఇది కాక సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కప్పెల సినిమా రీమేక్ కు ఓకె చెప్పారు. అయితే అది మల్టిపుల్ హీరో సినిమా. మరో హీరో కూడా వుంటారు. పైగా తక్కువ రోజులు వర్కింగ్ డేస్. అందువల్ల దాని రెమ్యూనిరేషన్ మాత్రం కోటిన్నరకు కాస్త తక్కువ అని తెలుస్తోంది.
మొత్తం మీద ఇప్పుడు చేతిలో వరుసగా నాలుగు సినిమాలతో విష్వక్ సేన్ ఫుల్ డిమాండ్ లో వున్నట్లు కనిపిస్తోంది.