Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్

నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్

నిజంగా ఓ ముఖ్యమంత్రిగా కాదు, ఓ అభిమానిగా మంచి మాట అన్నారు కేసిఆర్. ఎవరు ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు? అనేమీ అనుకోలేదు. 'మీరు మళ్లీ మంచి సినిమా తీయాలి. మీ అసిస్టెంట్ ల సాయంతో సినిమా తీయండి. నిర్మాణం సంగతి మరిచిపోండి, అది నేను చూసుకుంటాను' అన్నారు దర్శకుడు కే విశ్వనాధ్ తో. ఎంత మంచి మాట. భగవద్గీత పుస్తకాలు ఎవ్వరూ కొని చదవరు. ఎవరో పంచిపెట్టాల్సిందే. విశ్వనాధ్ తో సినిమా తీయించడం అంటే అలాంటిదే.

బూతులు సీన్లు, బూతు డైలాగులు కావాలి తప్ప, కళాఖండాలు ఎవరికి కావాలి? అందుకే తీసేవారు లేరు. అలాంటి టైమ్ లో తీయగలిగేవారు వున్నపుడు, కేసిఆర్ లా ముందుకు వచ్చి చేయూత నిచ్చే ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కావాలి. ప్రభుత్వం అంటే కేవలం పన్నుల వసూలు చేసి, ప్రజలకు ఓట్ల కోసం పప్పు బెల్లాలు పంచినట్లు పంచేయడమే అన్నట్లు తయారుచేసారు. దానికి ఓకె అంటున్నవారు, ఓ మంచి సినిమాను ప్రభుత్వం నిర్మించి, ఉచితంగా ప్రదర్శిస్తే ఎందుకు అడ్డం పడతారు?

మన ఖర్మ ఏమిటంటే, వయసు మీద పడిన విశ్వనాధ్ ను కేసిఆర్ పలకరించడానికి వెళ్తే, ఆయనకేదో ఆరోగ్యం బాగాలేదనో? సీరియస్ గా వుందనో? అనుమాన పడడం. అంత ఘోరమైన పరిస్థితికి, ఆలోచనా పద్దతికి వచ్చేసాం మనం. ఏమైనా సరే, ఎప్పుడో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక బాపు-రమణలతో పిల్లల కోసం అక్షరాలను, పాటలు, పద్యాలను, మంచి మాటలను చిన్న చిన్న వీడియోలుగా ప్రభుత్వ ఖర్చుతో చేయించారు. మళ్లీ ఇన్నాళ్లకు చేసినా, చేయకపోయినా, కేసిఆర్ ఓ మాట అన్నారు.

ఇది నిజంగా కార్యరూపం దాల్చితే విశ్వనాధ్ అభిమానులకు కొండంత ఆనందం. ఎందుకంటే తెలుగు సినిమా రంగానికి ఇలాంటి వ్యవహారాలు ఎలాగూ పట్టవు. శంకరాభరణం ఆ మధ్య పాతికేళ్లో, ముఫై ఏళ్లో పూర్తి చేసుకంటే, తమిళనాట మళ్లీ కొత్తగా అడియో ఫంక్షన్ చేసి, పెద్దఎత్తున కార్యక్రమాలు జరిపి, గౌరవించుకున్నారు. మన దగ్గర ఆ ఊసేలేదు. కేసిఆర్ పుణ్యమా అని కనీసం విశ్వనాధ్ సినిమాల వారోత్సవాల వంటివి చేసినా బాగుంటుంది కనీసం.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?