మొత్తానికి అందరి కన్నా ఎక్కువ లాస్ అవుతాడు అనుకున్నసన్నాఫ్ సత్యమూర్తి సేఫ్ జోన్ కు కాస్త దగ్గరగా వచ్చాడట. అయిదు కోట్ల ముఫై లక్షలకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం హక్కులు విక్రయించారు. రేసుగుర్రం కలెక్షన్లు అయిదుకోట్ల పాతిక లక్షల వరకు రావడమే ఇందుకు కారణం.
అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో, మిగిలిన ఏరియాల్లో లక్షలే కానీ, విశాఖ బయ్యర్ కు మాత్రం కోట్లు లాస్ తప్పదని అంచనా వేసారు. ఆ బయ్యర్ కూడా నిర్మాత దగ్గరకు వెళ్లి అలాగే బాధపడ్డారని వినికిడి. అందుకే విశాఖలో సక్సెస్ మీట్ చేస్తామని మాట ఇచ్చారు.
సరైన సినిమాల పడకపోవడం, దోచేయ్ డిజాస్టర్ కావడం, గంగ, లయన్, ఇంకా మరి కొన్ని సినిమాలు ఓ వారం వెనక బడడం, వంటి కారణాలు కూడా కలిసి వచ్చాయి. మొత్తానికి మరో యాభై వరకు వస్తే సత్యమూర్తి విశాఖ బయ్యర్ గట్టెక్కేసినట్లే అని తెలిసింది.