‘రుద్రమదేవి’పై రణం?

రుద్రమదేవి..దర్శకుడు గుణశేఖర్ కలల ప్రాజెక్టు. చాన్నాళ్లు ప్రీ పొడక్షన్ లో వుంది. ఆపై ప్రొడక్షన్ అయింది. ఇప్పుడు పోస్టు ప్రొడక్షన్ లో వుండిపోయింది. ఆ మధ్య దర్శకుడు నిర్మాత అయిన గుణ శేఖర్ తెగ…

రుద్రమదేవి..దర్శకుడు గుణశేఖర్ కలల ప్రాజెక్టు. చాన్నాళ్లు ప్రీ పొడక్షన్ లో వుంది. ఆపై ప్రొడక్షన్ అయింది. ఇప్పుడు పోస్టు ప్రొడక్షన్ లో వుండిపోయింది. ఆ మధ్య దర్శకుడు నిర్మాత అయిన గుణ శేఖర్ తెగ హడావుడి చేసారు. విశాఖలో, వరంగల్ లో ఆడియో ఫంక్షన్లు చేసారు. అంతే ఆ తరువాత మరి మరే మాటా లేదు. 

ఈ వైనం రుద్రమదేవి కోసం చూస్తున్న ప్రేక్షకులనే కాదు, కొన్ని ఏరియాలకు అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లను కూడా కలవరపెడుతోంది. దాదాపు సమ్మర్ సీజన్ మూడు వంతులు పూర్తి కావస్తోంది. ఇప్పటికి మే 22, 29 డేట్ల మాత్రం మిగిలాయి. ఇంకా కిక్  2, వగైరా సినిమాలు వున్నాయి. మరి గుణశేఖర్ విడుదల గురించి ఏ సంగతి చెప్పడం లేదు. దీంతో బయ్యర్లు కలవరపడుతున్నారు. 

సమ్మర్ సీజన్ దాటితే, కలెక్షన్లు ఆ రేంజ్ లో వుండవని గాబరా పడుతున్నారు. కానీ గుణశేఖర్ నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్ గా వున్నారు. దీంతో బయ్యర్లు ఇక లాభం లేదు గుణశేఖర్ ను నిలదీసి, సినిమా సమ్మర్ కు వస్తుందా రాదా? లేకుంటే తమకు కష్టం అవుతుందని, బిజినెస్ నుంచి పక్కకు తప్పుకుంటామని హెచ్చరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఒకటి రెండు రోజుల్లో జరిగే అవకాశం వుంది. మరి గుణశేఖర్ ఏమంటారో?