సంపూ లక్కే లక్కు?

ఒక్క సినిమా సోషల్ నెట్ వర్క్ పుణ్యమా అని హిట్ అనిపించుకుంది. కానీ ఆపై గెస్ట్ రోల్స్, సినిమాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. హీరో విష్ణు ఏకంగా సంపూ హీరోగా సినిమా చేయడమే ఓ లక్…

ఒక్క సినిమా సోషల్ నెట్ వర్క్ పుణ్యమా అని హిట్ అనిపించుకుంది. కానీ ఆపై గెస్ట్ రోల్స్, సినిమాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. హీరో విష్ణు ఏకంగా సంపూ హీరోగా సినిమా చేయడమే ఓ లక్ అనుకంటే, ఇప్పడు దర్శకరత్న దాసరి కూడా సంపూతో సినిమా చేస్తారట. 

ఆయన దగ్గర వున్న అనేకానేక శిష్యబృందంలో ఎవరో ఒకరు దీనికి దర్శకత్వం వహిస్తారు. సింగం 123, కొబ్బరిమట్ట అనే రెండు సినిమాలు ఇప్పటికే సంఫు ఖాతాలో వున్నాయి. దాసరిది మూడోది. ఇప్పుడు ఏ ఒక్కటి హిట్ కొట్టినా, అల్లరి నరేష్ తో తీయాలనుకునే స్పూఫ్ సినిమాలన్నీ సంపూ ఖాతాలోకి వెళ్లిపోతాయి.