Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఊర మాస్ వరుణ్ వస్తున్నాడు

ఊర మాస్ వరుణ్ వస్తున్నాడు

హరీష్ శంకర్ లేటెస్ట్ మూవీ వాల్మీకి. వరుణ్ తేజ్ రఫ్ క్యారెక్టర్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఒక పక్క ఈ సినిమాను చకచకా రెడీ చేస్తూనే, మరోపక్క ప్రమోషన్ యాక్టివిటీకి కూడా శ్రీకారం చుడుతున్నారు. వాల్మీకిగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను ప్రీ టీజర్ గా వదలబోతున్నారు.

ఈ ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ షాకింగ్ గెటప్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ గెటప్ ఊరమాస్ లుక్ తో వుంటుందని తెలుస్తోంది. గెడ్డం మాత్రమే కాకుండా మేకప్ అంతా ఊరమాస్ లుక్ మాదిరిగా వుంటుందట. వాల్మీకి తమిళ మాతృక జిగర్తాండలో కూడా బాబీ సింహా లుక్ ఇలాగే వుంటుంది. ఆ క్యారెక్టర్ సినిమాలో చాలా రఫ్ గా, రా గా వుంటుంది.

తెలుగులో దీన్ని మరికాస్త మందుకు తీసుకెళ్లి, వరుణ్ తేజ్ ను ఊరమాస్ గా చూపించబోతున్నట్లు బోగట్టా. కంచె, ఫిదా, ఇలా మంచి సినిమాలతో క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఈ కొత్త లుక్ తో ఎలా చేయబోతున్నాడో చూడాలి.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?