దొరసాని లక్ బాగుంది

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం దొరసాని. అంతేకాదు నటి జీవిత కుమార్తె శివాత్మికకు కూడా ఇదే తొలిసినిమా. ఈ సినిమాను జూలై 12న విడుదల చేయాలని ముందుగానే ప్రకటించారు.…

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా చేస్తున్న తొలి ప్రయత్నం దొరసాని. అంతేకాదు నటి జీవిత కుమార్తె శివాత్మికకు కూడా ఇదే తొలిసినిమా. ఈ సినిమాను జూలై 12న విడుదల చేయాలని ముందుగానే ప్రకటించారు. అయితే అదేరోజు పూరి-రామ్ ల ఇస్మార్ట్ శంకర్ కూడా వుంది. దాంతో గట్టి పోటీ వుంటుందని, అయినా మరో డేట్ లేదు కనుక ఆ డేట్ కే వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.

కానీ ఇఫ్పుడు దొరసాని లక్ తిరిగింది. ఇస్మార్ట్ శంకర్ వారం వెనుక్క వెళ్లింది. దొరసానికి ఇక ఒకే పోటీ మిగిలింది. సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే'  సినిమా కూడా అదే రోజు విడుదలవుతోంది. అయితే అది జోనర్ పక్కా థ్రిల్లర్. ఇది టెండర్ యూత్ లవ్ స్టోరీ. అందువల్ల దొరసాని యూనిట్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ.

12 డేట్ ను మిస్ కాకూడదని చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేస్తోంది. 12న తమ సినిమా విడుదల పక్కా అంటూ ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈ సినిమాకు మధుర శ్రీధర్ నిర్మాత.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'