వెయిటింగ్ లిస్ట్ లో మైత్రీ

ఇండస్ట్రీలో హ్యాపీయెస్ట్ బ్యానర్ ఏదని అడిగితే మైత్రీ అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ సినిమాలు లైన్ లో వున్నాయి. బన్నీ సినిమా, మహేష్ సినిమా స్టార్ట్ కాబోతున్నాయి. ప్రభాస్…

ఇండస్ట్రీలో హ్యాపీయెస్ట్ బ్యానర్ ఏదని అడిగితే మైత్రీ అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ సినిమాలు లైన్ లో వున్నాయి. బన్నీ సినిమా, మహేష్ సినిమా స్టార్ట్ కాబోతున్నాయి. ప్రభాస్ సినిమా లైన్ లో వుంది. ఎన్టీఆర్ సినిమా కూడా డిటో. ఇంకా చిన్న, మీడియం హీరోల సినిమాలు వుండనే వున్నాయి.  ఇదంతా కరోనా ముందు సంగతి. 

కానీ ఇప్పుడు చూస్తే అంతా ఎప్పుడు? అన్నది పెద్ద క్వశ్చను. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా స్టార్ట్ కావాలి. పూర్తి  కావాలి. ఆ తరువాత మైత్రీ సినిమా. అంటే కనీసం ఓ ఏడాది తరువాత సంగతి.

పవన్ కళ్యాణ్ సినిమా క్రిష్ సినిమా తరువాతే. అంటే దానికోసం కూడా మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్ సినిమా కోసం కూడా లాంగ్ వెయింటింగ్ తప్పదు.మహేష్ సినిమా-బన్నీ సినిమాలు ఇప్పుడు పక్కగా సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వున్నాయి. అవి కూడా 2021 సమ్మర్ సమయానికే రెడీ అవుతాయి. అప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలను బట్టి డేట్ వేసుకోవాల్సి వుంటుంది. 

ఈలోగా చిన్న, మీడియం హీరోల సినిమాలు చేద్దాం అన్నా కూడా వెయిటింగ్ అనివార్యంగా వుంది. ఇప్పటికే ఓ సినిమా మీద మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి స్క్రాప్ చేయాల్సి వచ్చింది. ఉప్పెన సినిమా విడుదల చేసినా, లాభాలు అన్నది సినిమా ఫలితం మీద ఆధారపడి వుంటుంది. ఎందుకంటే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చే ప్రాజెక్టు కాదు అది. 

మొత్తం మీద 2020 నుంచి 2021 సమ్మర్ వరకు మైత్రీకి పెట్టుబడులే తప్ప, వెనక్కు రావడం అన్నది కనిపించే అవకాశాలు లేనట్లే వున్నాయి. పైగా ఇఫ్పటికే ఇచ్చిన  దాదాపు పాతిక, ముఫై కోట్ల అడ్వాన్స్ లకు వడ్డీలు లెక్క వేసుకుంటే కాస్త కష్టంగానే వుంటుంది. 

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు