సీరియల్స్ లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నవ్యకు కరోనా వచ్చిందనే విషయం ఇప్పటికే బ్రేక్ అయింది. అయితే అక్కడితో ఆగకుండా ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ కథనాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై స్వయంగా నవ్వ స్పందించింది.
“అవును.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ నేను భయపడడం లేదు. నాకు నేనుగా వైద్యుల సలహాల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నేను ఇంట్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. రోగనిరోధకశక్తిని పెంచే మంచి భోజనం తింటూనే మందులు వేసుకుంటున్నాను. త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకొని షూటింగ్ లో పాల్గొంటాను.”
చాలామంది తనపై అసత్యపు కథనాలు ప్రసారం చేస్తున్నారని, అలాంటివన్నీ ఆపేయాలని నవ్య కోరుతోంది. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే వీడియో రిలీజ్ చేస్తున్నానని, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తోంది.
ఈమధ్య కాలంలో తనతో టచ్ లోకి వచ్చిన ఫ్రెండ్స్, ఆర్టిస్టులు దయచేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నవ్య కోరుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది.