Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వారెవ్వా..బాలయ్యా

వారెవ్వా..బాలయ్యా

హీరో నాగార్జున మాదిరిగా నాకు థర్టీనే..థర్టీనే అంటూ టముకు వేసుకోడు నందమూరి బాలయ్య. కానీ ఒక్కసారి మేకోవర్ అయితే భలేగా వుంటాడు. ఫిజిక్, లావు సంగతి అలా వుంచితే, లేటెస్ట్ గా మేకోవర్ తో సోషల్ మీడియాలోకి వచ్చిన బాలయ్య స్టిల్ భలేగా ఆకట్టుకుంటోంది ఫ్యాన్స్ ను. 

మొన్నటి దాకా అతి పెద్ద మొహం, భీకరమైన గెడ్డంతో కనిపిస్తూ వచ్చాడు బాలయ్య. ఎన్నికల ముందు నుంచి నిన్న మొన్నటి వరకు ఇదే గెటప్. ఇప్పుడు టక్కున మొత్తం మార్చేసాడు. చిత్రమైన గెడ్డం, పైకి దువ్విన క్రాఫ్ తో బిలో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి వచ్చేసాడు.

కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి కళ్యాణ్ నిర్మించే సినిమా కోసమే ఈ గెటప్, ఈ మేకోవర్. ఇక మిగిలింది లావు తగ్గడం. డైరక్టర్ బోయపాటికి మాట ఇచ్చాడట బాలయ్య. ఆయన సినిమా వేళకు బాగా స్లిమ్ అయి వస్తానని. ఇటు ఫేస్ మేకోవర్, అటు ఫిజిక్ మేకోవర్ అయితే బాలయ్య కూడా నాగ్ లా నాకు థర్టీనే అని చెప్పుకోవచ్చేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?