cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫ్యాన్స్ మధ్యకు పవన్ కళ్యాణ్

ఫ్యాన్స్ మధ్యకు పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాకాలం తరువాత సినిమా ఫ్యాన్స్ మధ్యకు రాబోతున్నారా? మెగా ఫ్యాన్స్ వర్గాల సమాచారం చూస్తుంటే వస్తున్నట్లే కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఏటా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను కాస్త హడావుడిగా సెలబ్రేట్ చేస్తుంటారు. చిరంజీవి రారు కానీ, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వస్తుంటారు.

ఈ ఏడాది స్పెషల్ ఏమిటంటే సైరా సినిమా టీజర్ విడుదల. సైరా సినిమా టీజర్ ను ముంబాయి లో మంగళవారం విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అయితే 22న శిల్పకళావేదికలో కానీ మరెక్కడైనా కానీ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ మీట్ కు నాగబాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

సైరా సినిమాకు పవర్ స్టార్ క్రేజ్ ను కూడా వాడుకోవాలని మెగా క్యాంప్ చూస్తోందని ఇప్పటికే అర్థం అయిపోయింది. పవర్ స్టార్ చేత వాయిస్ ఓవర్ చెప్పించడం, ఆ స్టిల్స్, వీడియోలు ప్రచారానికి వాడుకోవడం షురూ చేసారు. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యకు పవన్ ను తీసుకువచ్చే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది.

ఇదంతా ఉభయ కుశలోపరి వ్యవహారం అన్నట్లు వుంది. ఇటు సినిమాకు పవర్ స్టార్ క్రేజ్ పనికి వస్తుంది. అటు పవర్ స్టార్ కు కూడా మళ్లీ సినిమా టచ్ ఇచ్చినట్లు వుంటుంది. కానీ ఒకటే అనుమానం పవన్ కు ఒక సెక్షన్ జనాల్లో వున్న వ్యతిరేకత కాస్తా సైరాకు కూడా వ్యతిరేకంగా మారితే మాత్రం కష్టమే.