cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఒరిజినల్ తుపాకి చేతిలో పెట్టి సాహో అన్నారు

ఒరిజినల్ తుపాకి చేతిలో పెట్టి సాహో అన్నారు

యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు బోలెడన్ని తుపాకులు వాడడం కామన్. కానీ సాహో సినిమాలో మాత్రం సహజత్వం కోసం నిజమైన గన్స్ వాడారు. అవును.. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రద్ధాకపూర్ స్వయంగా బయటపెట్టింది. తన జీవితంలో ఫస్ట్ టైమ్ నిజమైన తుపాకీ పట్టుకున్నానని చెప్పుకొచ్చింది శ్రద్ధ.

"సాహో షూటింగ్ లో భాగంగా మేం కొన్ని ఒరిజినల్ తుపాకులు వాడాం. నేచురాలిటీ కోసమే అలా చేశాం. కాకపోతే అందులో బుల్లెట్స్ ఉండేవికావు. అలా ఫస్ట్ టైమ్ నేను ఓ రియల్ తుపాకీ పట్టుకున్నాను. చూడ్డానికి చిన్నదిగా అనిపించినప్పటికీ ఒరిజినల్ గన్ చాలా బరువుంది. అంతేకాదు చాలా సౌండ్ కూడా వస్తుంది. ఫస్ట్ టైమ్ డమ్మీ బుల్లెట్స్ తో గన్ కాల్చినప్పుడు ఆ శబ్దానికి నా చెవులు చాలాసేపు పనిచేయలేదు. ఆ తర్వాత ఇయర్-బడ్స్ పెట్టుకొని షూట్ చేశాం."

సాహో కోసం ఒరిజినల్ తుపాకులు వాడిన విషయాన్ని ఇలా బయటపెట్టింది శ్రద్ధాకపూర్. ప్రారంభంలో ఆ తుపాకీ సౌండ్ కు వెన్నులో వణుకు వచ్చేదని, తర్వాత అలవాటైపోయిందని చెప్పింది. సినిమా కోసం రెండేళ్లు పనిచేయడంతో.. యాక్షన్ సీన్ అనగానే ముందుగా గన్ తీసుకుని సరదాగా దానితో ప్రాక్టీస్ చేసేదానని అంటోంది శ్రద్ధాకపూర్.

సాహో తర్వాత కూడా సౌత్ లో కొనసాగాలనుకుంటున్నట్టు స్పష్టంచేసింది శ్రద్ధాకపూర్. హిందీ సినిమాలు చేస్తూనే, కుదిరితే తెలుగు-తమిళ భాషల్లో నటిస్తానని ప్రకటించింది. ఈనెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది సాహో.