పవన్..?మరి సినిమాల మాటేమిటి?

ఉన్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేస్ ను పొలిటికల్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఏదో ఇలా తిరుపతి వెళ్లి, అభిమాని కుటుంబాన్ని పరామర్శించి, అలా వచ్చేస్తారు అనుకుంటే, అక్కడ స్టక్ అయిపోయారు. ప్రజారాజ్యం పార్టీ…

ఉన్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేస్ ను పొలిటికల్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఏదో ఇలా తిరుపతి వెళ్లి, అభిమాని కుటుంబాన్ని పరామర్శించి, అలా వచ్చేస్తారు అనుకుంటే, అక్కడ స్టక్ అయిపోయారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఆరేళ్ల క్రితం ఆగస్టు 26న చిరంజీవి తిరుపతిలో తొలి సభ జరిపారు. ఇప్పుడు పవన్ ఆగస్టు 27న సభ ఏర్పాటు చేసారు. మంచి టైమ్, ముహుర్తం ఇలాంటి వాటిపై తిరుపతిలో పురోహితులతో చర్చలు కూడా జరిపారు. పవన్ కు ఈ నమ్మకాలు బాగానే వున్నాయి.

ఇక నుంచి అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించే ఆలోచనలో పవన్ వున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయ. అయితే ఇదంతా గ్యారంటీ లేని వ్యవహారం. ఎందుకంటే పవన్ ఏదీ ప్లానింగ్ గా చేయరని ఇప్పటి దాకా జరుగుతున్న విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా గాలి వాటంగా కనిపిస్తుంటుంది మరి. కానీ పవన్ ఫిక్సయిపోయారు, ఇక రాజకీయంగా ముందుకు వెళ్తారు, అని అనుకుంటే మాత్రం సినిమాల మీద అనుమానం కలుగుతుంది.

పవన్ మూడు సినిమాలు కమిట్ అయి వున్నారు. ఒకటి ఆల్ మోస్ట్ స్వంత సినిమా. డాలీ దర్శకత్వంలో శరద్ మురార్ నిర్మించేది. రెండవది హారిక హాసిని పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో. మూడవది ఎఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడితో సినిమా. మరి మూడు సినిమాలు కమిట్ అయి, రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అందునా, పని విషయంలో పవన్ అంతగా డిసిప్లిన్డ్ గా వ్యవహరించరని టాలీవుడ్ లో గుసగుసలు వున్నాయి. అదే నిజమైతే, ఈ సినిమాలు అటకెక్కేసే ప్రమాదం కనిపిస్తోంది.

నిజంగా రాజకీయంగా ముందుకు వెళ్లాలని పవన్ డిసైడ్ అయితే, అభిమానులు పవన్ కొత్త సినిమాలు చూడాలంటే కాస్త కష్టమేమో? అతి కష్టం మీద పూర్తి చేయాల్సి వుంటుంది. అది కూడా రాజకీయంగా మరింత క్రేజ్ సంపాదించుకోవడం కోసం. 

మరి పవన్ ఆలోచన ఎలా వుందో ఈ రోజు సాయంత్రం కొంత క్లారిటీ వస్తుంది.