“ఏదో సరదాగా చెప్పిన డైలాగ్ అది. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నా తొలి సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడిని నేనెందుకు కామెంట్ చేస్తాను. నా మాటల్లోని ఫన్‌ని మాత్రమే తీసుకోండి.. ఎవరైనా ఇబ్బందిపడుంటే సారీ..” తాప్సి చెప్పిన మాటలివి. స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి మరీ తాప్సి క్షమాపణలు కోరింది.
మొన్నటివరకు తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న తాప్సి ఇప్పుడు సెడెన్ గా మారిపోయింది. ఓపెన్ గా తెలుగు ప్రేక్షకులకు, రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెప్పింది. అయితే అదేదో మనసు లోపలి పొరల్లోంచి వచ్చిన క్షమాపణ కాదు. కేవలం తన కెరీర్ కు బ్రేక్ పడకూడదనే తాప్సి అలా చేసిందట.
తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు తాప్సికి. దానికి తోడు రాఘవేంద్రరావుపై వేసిన సెటైర్లు ఆమెకిక టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి టైమ్ లో ఆమె నటించిన ఆనందో బ్రహ్మ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. తాప్సి కామెంట్స్ వ్యవహారం కచ్చితంగా ఈ సినిమాపై పడుతుంది.
ఆనందో బ్రహ్మ సినిమాకు ఇబ్బందులు ఎదురవ్వకూడదని, తెలుగులో ఆమె అవకాశాలకు బ్రేక్ పడకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పిందట తాప్సి.