యూట్యూబ్ సెన్షేషన్ గా మారింది ఒక షార్ట్ ఫిల్మ్. ఒకవైపు బోల్డ్ గా మరోవైపు బ్యూటిఫుల్ గా ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ పట్ల కొంతమంది వీర సంప్రదాయ వాదులు విరుచుకుపడవచ్చు. నీఛం.. దరిద్రం.. అంటూ హిపోక్రాట్స్ లా మాట్లాడవచ్చు. దీని రూపకర్తలను, పరిచయం చేస్తున్న వాళ్లను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ.. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచనాత్మకంగానే ఉంది.
సెక్స్ విషయంలో… జనరేషన్ కు జనరేషన్ కు మధ్య గ్యాప్ ను అర్థమయ్యేలా చేస్తోంది. సెక్స్ లో భావప్రాప్తి అంటే ఏమిటో.. తెలియకుండానే చాలా మంది మహిళల జీవితాలు పూర్తి అవుతున్నాయని సెక్సాలజిస్టులు కుండబద్దలు కొడుతున్నారు. ఇదే పాయింట్ ను హైలెట్ చేస్తోంది ఈ షార్ట్ ఫిల్మ్. అయితే సెక్స్ విషయంలో నేటి తరం అమ్మాయిల ధోరణి పూర్తిగా మారిపోయి ఉండటం సహజమే. తమకు కావాల్సిన ఆనందాన్ని పార్ట్ నర్ నుంచి అడిగి తీసుకునే తత్వం.. ఈ తేడా తల్లికూతుళ్ల మధ్యన చూపించారు.
చాలా క్రిటికల్ టాపిక్. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. అన్ని వైపుల నుంచి విమర్శలు తప్పవు. ఇక్కడే దీని రూపకర్తల ప్రతిభ బయటపడింది. బూతు ఎక్కడా ధ్వనించడం కాదు కదా.. కనీసం ‘సెక్స్’ అనే మాటే వినిపించదు, బెడ్రూమ్ పదజాలం లేదు… చక్కగా డిప్లొమాటిక్ వర్డ్స్ ఉపయోగించి, పరోక్షంగా సెక్స్ గురించి ఒక అర్థవంతమైన చర్చలా రూపొందించారు. తల్లి, కూతురు, మరో మహిళ.. ఈ మూడు పాత్రలతో సాగే ఈ షార్ట్ ఫిల్మ్ అభినందనలు అందుకుంటోంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంటోంది.