Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రీఎంట్రీలో కూడా మారని ఇలియానా?

రీఎంట్రీలో కూడా మారని ఇలియానా?

హీరోయిన్ ఇలియానాపై తెలుగు ఇండస్ట్రీ నుంచి ఓ పెద్ద కంప్లయింట్ ఉండేది. సినిమా షూటింగ్స్ మినహా ప్రమోషన్ కార్యక్రమాలకు రావాలంటే ఆమె కాళ్లావేళ్ల పడాల్సిందే.. కేవలం మాటల్తో సరిపోదు, ఎక్స్ ట్రా ఎమౌంట్ కూడా ముట్టచెప్పాలి. పేమెంట్ పడకపోతే ప్రమోషన్లకు రాకుండా ఎగ్గొట్టేది ఇలియానా. అలా ఇలియానా హాజరైన సినిమా ప్రచార కార్యక్రమాల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీ విషయంలో కూడా అదే జరిగింది. ఇలియానా తన పాత స్వభావాన్ని మరోసారి చూపిస్తోంది. ఇప్పటిదాకా సినిమా టీమ్ అంతా టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేసింది, ఒక్క ఇలియానా తప్ప. దీంతో ఇలియానా వ్యవహార శైలిపై మరోసారి విమర్శలు చెలరేగుతున్నాయి.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు సంబంధించి ఈరోజు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు ఏ ప్రచార కార్యక్రమానికి హాజరుకాని ఇలియానా, కనీసం ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కైనా వస్తే బాగుంటుంది. కేవలం హీరో, దర్శకుడు, ఇతర నటీనటులతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చప్పగా సాగుతుంది.

అందుకే ఇలియానా కోసం నిర్మాతలు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆమె వస్తేనే ఈవెంట్ కి అదనపు 'కిక్' వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన ఇలియానా తన పద్ధతి మార్చుకుందని అంతా అనుకున్నారు.

తెలుగులో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడంతో ఇలియానాను అంతా మారిన మనిషిగా చూశారు. తను పూర్తిగా మారానని, డెడికేషన్ తో ఉన్నానని నిరూపించుకోవాలంటే ఇలియానా, ఈరోజు జరిగే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తప్పనిసరిగా హాజరుకావాలి. మరి ఆమె ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వస్తుందా.. లేక ఎప్పట్లానే డుమ్మా కొడుతుందా అనేది చూడాలి.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?