ఈసారి కొరటాల ఫీల్ అయి తీయగలడా..?

“సొంత ఆలోచనను తెరపై చూపించడం తేలిక. ఎందుకంటే సీన్ ఎలా ఉంటే బాగుంటుందనే ఐడియా అప్పటికే మన మైండ్ లో ఉంటుంది. వేరే వాళ్ల కథ అయితే ఈ విషయంలో కాస్త కష్టంగా ఉంటుంది”…

“సొంత ఆలోచనను తెరపై చూపించడం తేలిక. ఎందుకంటే సీన్ ఎలా ఉంటే బాగుంటుందనే ఐడియా అప్పటికే మన మైండ్ లో ఉంటుంది. వేరే వాళ్ల కథ అయితే ఈ విషయంలో కాస్త కష్టంగా ఉంటుంది” స్వయంగా కొరటాల అన్న మాటలివి. చెప్పినట్టుగానే ఇప్పటివరకు తన సినిమాలకు తనే కథలు, మాటలు రాసుకున్నాడు కొరటాల. అవన్నీ చాలా బాగా వచ్చాయి. మరి 'భరత్ అనే నేను' సినిమా సంగతేంటి?

ఇది కొరటాల కథ కాదు. ఓ కుర్ర రచయిత రాసిన కథను కోటి రూపాయలు ఇచ్చి కొరటాల కొనుక్కున్నాడని, ఆ స్టోరీతోనే ఇప్పుడు మహేష్ తో 'భరత్ అనే నేను' సినిమా తీస్తున్నాడనే వార్తలు ఎప్పట్నుంచో నలుగుతున్నాయి. మూవీ సెట్స్ పైకి వచ్చినా కొరటాల మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ సంగతి పక్కనపెడితే.. తనది కాని కథని మనస్ఫూర్తిగా తెరకెక్కించలేనన్న కొరటాల, ఈ సినిమాను ఎలా తీస్తున్నాడనేదే ఇప్పుడు అందరి డౌట్.

దీనికి తోడు ఇప్పుడు ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా అభిమానుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. మహేష్ రెండోసారి ఛాన్స్ ఇచ్చిన దర్శకులెవరూ నిరూపించుకోలేకపోయారు. గుణశేఖర్, శ్రీకాంత్ అడ్డాల.. చివరికి త్రివిక్రమ్ కూడా మహేష్ తో సెకెండ్ టైం మూవీస్ చేసి ఫ్లాపులు ఇచ్చారు. ఈ విషయంలో పూరి జగన్నాధ్ ఒక్కడే మినహాయింపు. ఇప్పుడు మహేష్ తో సెకెండ్ టైం మూవీ చేసే ఛాన్స్ అందుకున్నాడు కొరటాల. 

తనది కాని కథ, మరోవైపు బ్యాడ్ సెంటిమెంట్… ఇలా రెండు ప్రతికూల అంశాల మధ్య మహేష్ తో సినిమా చేస్తున్నాడు కొరటాల.