మహేష్ కు సినిమా ఒక్కటే లోకం కాదు. అతడికి యాడ్స్ కూడా అవసరమే. దీంతోపాటు కుటుంబంతో ఎప్పటికప్పుడు విహార యాత్రలు కూడా ఉండనే ఉన్నాయి. ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందుకే ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేయగలుగుతున్నాడు మహేష్. సినిమాకు అటుఇటుగా 10 నెలల టైమ్ తీసుకుంటున్నాడు. అలాంటి మహేష్ కు సినిమా చేయడానికి కేవలం 7 నెలలు మాత్రమే టైమ్ దొరికింది. మరి సినిమా సాధ్యమేనా?
అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. వచ్చేనెలలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకుంటున్నారు. అంటే మహేష్ కు ఉన్నది అటుఇటుగా 7 నెలలు టైమ్ మాత్రమే.
ఈ 7 నెలల్లో మహేష్ సినిమా పూర్తిచేయగలడా అనేది అందరి డౌట్. మరోవైపు దిల్ రాజు మాత్రం సెంటిమెంట్ కొద్దీ సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యాడు. అనీల్ రావిపూడి, ఎఫ్2, సంక్రాంతి.. ఇది దిల్ రాజు సెంటిమెంట్. దీన్ని మహేష్ అందుకోగలడా అనేది అందరి సందేహం.
లిస్ట్ చూసుకుంటే మహేష్ బాబు సినిమాలు చెప్పిన టైమ్ కు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మహర్షి సినిమా కూడా ఈపాటికి థియేటర్లలోకి రావాల్సిన సినిమా. ఇలా చూసుకుంటే అనీల్ రావిపూడి-మహేష్ సినిమాను కూడా వాయిదా వేయడం చాలా ఈజీ. కానీ బంగారం లాంటి సంక్రాంతి సీజన్ మిస్ అయిపోతుంది. అదీ సంగతి.