నాని చెంతకు చేరిన రానా సినిమా

అనగనగా ఓ దొంగ. అతడి పేరు నాగేశ్వరరావు. బాగా తెలిసినవాళ్లు అతడ్ని టైగర్ నాగేశ్వరరావు అని పిలుస్తారు. ఎందుకంటే ఎలాంటి ఇంటికైనా కన్నం వేసే మొనగాడు అతడు. చోర కళలో ఆరితేరిన ఆ దొంగ…

అనగనగా ఓ దొంగ. అతడి పేరు నాగేశ్వరరావు. బాగా తెలిసినవాళ్లు అతడ్ని టైగర్ నాగేశ్వరరావు అని పిలుస్తారు. ఎందుకంటే ఎలాంటి ఇంటికైనా కన్నం వేసే మొనగాడు అతడు. చోర కళలో ఆరితేరిన ఆ దొంగ స్టువర్టుపురం ప్రాంతంలో నిజంగానే ఉండేవాడు. ఇది కథ కాదు.

ఒకప్పుడు పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు కథతో సినిమా ప్లాన్ చేశాడు నిర్మాత అనీల్ సుంకర. వంశీ కృష్ణ ఆకెళ్ల కథ కూడా రాసుకున్నాడు. ఈ బయోపిక్ లో నటించడానికి రానా ఒప్పుకున్నాడు. ఇక సినిమా ప్రారంభించడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో కథ మొత్తం రివర్స్ అయింది.

టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టు నుంచి రానా తప్పుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు రానాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు, త్వరలోనే కోడి రామ్మూర్తి బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా, టైగర్ నాగేశ్వరావు ప్రాజెక్టును పక్కనపెట్టాడు.

ఇప్పుడీ రియల్ లైఫ్ స్టోరీ అటుఇటు తిరిగి నాని చెంతకు చేరింది. కృష్ణార్జున యుద్ధం ఎఫెక్ట్ తో తన వద్ద ఇప్పటికే పెండింగ్ లో ఉన్న సినిమాల్ని పక్కనపెట్టేసిన నాని, టైగర్ నాగేశ్వరరావు కథలో నటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే స్టోరీ డిస్కషన్ నడుస్తోంది.