వండర్.. బిలో.. వండర్ ఫుల్

ఛల్ మోహన్ రంగా ట్రయిలర్ వచ్చేసింది. ఓ రోమాంటిక్ ఫీల్ కలిగించడంతో పాటు, ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోడించడం అన్నదే లక్ష్యం అని ట్రయిలర్ చెప్పకనే చెప్పింది. నితిన్ సక్సెస్ కొట్టిన…

ఛల్ మోహన్ రంగా ట్రయిలర్ వచ్చేసింది. ఓ రోమాంటిక్ ఫీల్ కలిగించడంతో పాటు, ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోడించడం అన్నదే లక్ష్యం అని ట్రయిలర్ చెప్పకనే చెప్పింది. నితిన్ సక్సెస్ కొట్టిన గోవా బ్యాక్ డ్రాప్ లోని లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఇష్క్. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ఓ పక్క ఎంటర్ టైన్ మెంట్ మరో పక్క లవ్, రోమాన్స్ కలిపి ఊటీ నేపథ్యంలో స్టోరీ అల్లుకున్నట్లు కనిపిస్తోంది.

అ..ఆ ట్రయిలర్ లో వినిపించిన లవ్ చేసేంత లగ్జరీ లేదు. వదిలేసేంత లెవెలూ లేదు అనే డైలాగు మాదిరిగానే. మీరే పట్టుకుంటారు.. మీరే వెళ్లిపోమంటారు అనే ఓ ఎమోషన్ డైలాగు జోడించారు. అక్కడా ఇక్కడా నితిన్ ఒకలాగే కనిపించాడు. వినిపించాడు.

కమెడియన్ బ్యాచ్ తో నితిన్ ఎంటర్ టైన్ మెంట్ పండించేలాగే వుంది. మోహన్ రంగా గా నితిన్ ఇష్క్, అ..ఆ సినిమాల్లో ఎలా వున్నాడో అలాగే వున్నాడు కొత్త మేకోవర్ ఏమీలేదు.

నటరాజ సుబ్రహ్మణియం సినిమాటోగ్రఫీ రిచ్ నెస్ ట్రయిలర్ లో కనిపిస్తోంది. మళ్లీ రావు రమేష్ అజ్ఞాతవాసిలో మాదిరిగానే ఫైనల్ పంచ్ వేసాడు ఈ ట్రయిలర్ లో కూడా వండర్ డాన్ వండర్ ఫుల్ అంటూ. మొత్తంమీద చూసుకుంటే నితిన్ సినిమాల స్టయిల్ కు త్రివిక్రమ్ స్టయిల్ కలిపి ట్రయిలర్ కట్ చేసినట్లుంది.