యమలీల 2 ఏమయింది?

ఎస్వీకృష్ణారెడ్డి చాన్నాళ్ల తరువాత తయారుచేస్తున్న సినిమా యమలీల 2. డాక్టర్ కెవి సతీష్ తానే హీరోగా నిర్మిస్తున్న సినిమా ఇది. మోహన్ బాబు యముడి పాత్ర పోషించారు. ఈ సినిమా నిర్మాణం తదితర వ్యవహారాలు…

ఎస్వీకృష్ణారెడ్డి చాన్నాళ్ల తరువాత తయారుచేస్తున్న సినిమా యమలీల 2. డాక్టర్ కెవి సతీష్ తానే హీరోగా నిర్మిస్తున్న సినిమా ఇది. మోహన్ బాబు యముడి పాత్ర పోషించారు. ఈ సినిమా నిర్మాణం తదితర వ్యవహారాలు పూర్తయ్యాయి. చకచకా వార్తల్లో వుంటూ పూర్తయిన ఈ సినిమా గురించిన విషయాలు ఒక్కసారి సైలెంట్ అయ్యాయి. 

అడియో ఫంక్షన్ జరగాల్సి వుంది. అయితే ఇంతకాలం కాస్త జోరుగా ఖర్చు చేసిన నిర్మాత, ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గారని వార్తలు వినవస్తున్నాయి. అడియో ఫంక్షన్ కు స్పాన్సర్లను వెదుకుతున్నారని మరో టాక్. రెడ్డి ద్వయం కాస్త ఎక్కువగా ఖర్చు చేయించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న వదంతులు కూడా వినిపిస్తున్నాయి.