Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యాత్ర సినిమాకు బ్రేక్ వేయాలని చూసారా?

యాత్ర సినిమాకు బ్రేక్ వేయాలని చూసారా?

కొన్ని కొన్ని సంగతులు ఆలస్యంగా వెలుగు చూస్తుంటాయి. వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా సరిగ్గా ఎన్నికల టైమ్ లో మా టీవీలో ప్రసారం అయింది. ఇలా ప్రసారం చేయవద్దని మా టీవీ మీద చాలా గట్టి వత్తిడి వచ్చిందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వైనం ఇలా వుంది.

స్టార్ మాలో బిగ్ బాస్ 3 సీజన్ ప్రారంభం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో శ్వేతారెడ్డి అనే యాంకర్ ఆ చానెల్ ఉద్యోగులు కొందరి మీద ఆరోపణలు చేసారు. బిగ్ బాస్ 3 సెలక్షన్ల వెనుక కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలున్నాయని ఆరోపించారు. ఈ విషయమై వెంటనే ఓ పత్రికలో కాస్త ప్రముఖంగా ఆ వ్యవహారాన్ని ప్రచురించారు. అలాగే అదే పత్రిక వెబ్ సైట్ లో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. అక్కడితో ఆగకుండా ఈ వ్యవహారంపై వారి ఛానెల్ లో డిస్కషన్ కూడా పెట్టారు.

ఈ విషయమై స్టార్ మా వర్గాల నుంచి ఓ చిత్రమైన సమాచారం తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ గడబిడను అంతగా పట్టించుకోవద్దని ఆ చానెల్ నిర్వాహకులకు 'మనం మనం మీడియా' కదా అనే యాంగిల్ లో రిక్వెస్ట్ వెళ్లిందట. దానికి ఆ చానెల్ నుంచి చిత్రమైన సమాధానం వచ్చిందని తెలుస్తోంది. 'మేం ఎన్నికల ముందు యాత్ర సినిమా వేయవద్దు అంటే మీరు ఆపారా? లేదుకదా?' అన్నది ఆ సమాధానంగా తెలుస్తోంది.

ఇదేంటీ అని విచారిస్తే, ఎన్నికల ముందు స్టార్ మాలో యాత్ర సినిమా ప్రసారం అవుతుందని తెలిసి, సదరు చానెల్ పెద్ద ఒకరు అలా చేయవద్దని గట్టి వత్తిడి తెచ్చినట్లు తెలిసింది. కానీ అలా చేయకుండా స్టార్ మా ఛానెల్ ముందుకు వెళ్లిందట. ఇప్పుడు తమ టైమ్ వచ్చిందని ఆ చానెల్ తన పని తను చేసుకుంటూ పోతోందట.. అదీ విషయం.

ఎవరి టైమ్ వచ్చినపుడు వారు తమ ప్రతాపం చూపించడమే మీడియా పాలసీగా మారిపోయింది అనుకోవాల్సిదే.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?