ఆల్ ఆఫ్ ది సడెన్ గా బన్నీ సినిమా నాపేరు సూర్య డార్జిలింగ్ షెడ్యూలు ఆగిపోయింది. అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా పర్మిషన్లు క్యాన్సిల్ చేసారు. మళ్లీ అలాంటి మంచుతో కూడిన లోకేషన్ కావాలి షూట్ చేయాలంటే.
క్లయిమాక్స్ లో హీరో మళ్లీ మరోసారి మిలటరీలో చేరినట్లు చూపించే సన్నివేశాలు, ఓ పాట కు అలాంటి లోకేషన్లే కావాలి. కాశ్మీర్ తో తీయాలని ప్లాన్. అందుకోసం ఫాస్ట్ గా షిప్టింగ్ చేస్తున్నారని వినికిడి. దాదాపు ఈ విషయాలన్నీ నిర్మాత లగడపాటి శ్రీధర్ నే కన్ ఫర్మ్ చేసారు.
ఇదిలా వుంటే మంచుకొండల్లో గడ్డ గట్టే చలిలో బన్నీ సాహసాలు చేస్తున్నారంటూ ప్రెస్ నోట్. అంటే ఏది నిజం? షిప్టింగ్ అంత ఫాస్ట్ గా అయిపోయిందా? షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? లేక స్టార్ట్ అవతుంది కాబట్టి, ఫ్యాన్స్ కు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వుండాలని ఇలా వదిలారా?
షెడ్యూలు క్యాన్సిల్ అయింది. లేట్ అవుతుంది అని వార్తలు వస్తే, బయ్యర్లు ముందు వెనుక అవుతారని అనుమానంతో ఇలా కవర్ చేయాడానికి ప్రయత్నించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.