ఇళయరాజాకు మెగాస్టార్ సత్కారం

ఇళయరాజాకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. స్వరజ్ఞాని ఇళయరాజాకు అలాంటి అవార్డు అంటే అది పక్కాగా సముచిత సత్కారమే. అయితే ఇళయరాజా అంటే భారతీయ సినిమా సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తి. Advertisement కేవలం తమిళనాడుకు…

ఇళయరాజాకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. స్వరజ్ఞాని ఇళయరాజాకు అలాంటి అవార్డు అంటే అది పక్కాగా సముచిత సత్కారమే. అయితే ఇళయరాజా అంటే భారతీయ సినిమా సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తి.

కేవలం తమిళనాడుకు చెందిన మనిషి కాదు. తెలుగునాట ఇంటింటా, ఇళయరాజా అభిమాని ఒకరు వుంటూనే వుంటారు. అందుకే అలాంటి వ్యక్తిగా అంత విశిష్టమైన అవార్డు లభించడంతో టాలీవుడ్ తరపున కూడా సత్కరించాలన్న నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రతిపాదించినట్లు తెలిసింది.

టాలీవుడ్ అతిరథ, మహారధులంతా కలిసి ఇళయారాజకు నభూతో అనే రేంజ్ లో సత్కారం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17న ఈ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ ఇలా తెలుగు సీనియర్ హీరోలంతా ఈ ఫంక్షన్ లో పాల్గొంటారు. 

అయితే ఈ ఫంక్షన్ ను మా ఆధ్వర్యంలో చేస్తారా? టాలీవుడ్ తరపున అందరూ కలిసి చేస్తారా? ఎక్కడ? అన్న మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.