మంచు విష్ణు-దాసరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎర్రబస్సు. ఈ సినిమాకు తమిళ సినిమా ఆధారం. ప్రారంభంలో తాత మనవడు అని పేరు పెడతారని టాక్ వచ్చింది. కానీ ఎర్రబస్సు అని పేరు పెట్టారు.
ఇటీవలే ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన గ్యాసిప్ బయటకు వచ్చింది. సినిమాలో విష్ణు పాత్ర ఇరవై నుంచి ముఫై నిమషాలకే పరిమితం అన్నది ఆ గ్యాసిప్. తమిళంలో పూర్తి స్థాయి రోల్ ని తెలుగులో తగ్గించారని కూడా అంటున్నారు.
అయితే ఇదంతా నిరాధారమని, సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా విష్ణు పాత్ర వుంటుందని ఆ సినిమా పీఆర్వో, దర్శకుడు దాసరి సన్నిహితుడు ప్రభు అంటున్నారు. దాసరి పాత్ర అయినా కాస్త వెనగ్గా తెరపైకి వస్తుందని కానీ, విష్ణు పాత్ర ముందే వస్తుందని,చివరంటా వుంటుందని చెబుతున్నారు. అయితే…ఇంతకీ ఈ వార్త ఇలా వుంటే, ఈ విషయాన్ని విష్ణు ఇంత వరకు ఎందుకు ఖండించలేదో అన్న సందేహాలు కూడా వినివస్తున్నాయి.