నిజమే.. స్పైడర్ లో చాలా దాచేశాం

స్పైడర్ టీజర్, ట్రయిలర్ విడుదలైనప్పుడు దాదాపుగా ఒకే టాక్ వినిపించింది. ఆశించిన స్థాయిలో ట్రయిలర్ లేదన్నారు చాలామంది. సినిమాపై క్రేజ్ ను పెంచేలా ట్రయిలర్ లో ఎలిమెంట్స్ లేవనే కామెంట్స్ పడ్డాయి. ఎట్టకేలకు ఈ…

స్పైడర్ టీజర్, ట్రయిలర్ విడుదలైనప్పుడు దాదాపుగా ఒకే టాక్ వినిపించింది. ఆశించిన స్థాయిలో ట్రయిలర్ లేదన్నారు చాలామంది. సినిమాపై క్రేజ్ ను పెంచేలా ట్రయిలర్ లో ఎలిమెంట్స్ లేవనే కామెంట్స్ పడ్డాయి. ఎట్టకేలకు ఈ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు మహేష్. దాని వెనకున్న కారణాన్ని కూడా బయటపెట్టాడు.

“సినిమాలో ఏముందో ట్రయిలర్ లో అదే చూపించాం. లేనిపోని అంచనాలు పెంచేలా ఏదీ చూపించలేదు. కాకపోతే చాలా థ్రిల్ ఫీలయ్యే ఎలిమెంట్స్, మరికొన్ని హైలెట్స్ స్పైడర్ లో ఉంటాయి. వాటిని మాత్రం ట్రయిలర్ లో చూపించలేదు. థియేటర్లలో ఆడియన్స్ వాటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సీటు అంచున కూర్చుని ఉత్కంఠతో చూసేలా ఆ ఎపిసోడ్స్ ఉంటాయి.” కావాలనే ట్రయిలర్ లో కొన్నింటిని చూపించలేదనే విషయాన్ని మహేష్ ఇలా ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. 

సినిమాపై అంచనాలు పెంచకూడదనే ఉద్దేశంతోనే స్పైడర్ యూనిట్ ఇలా లో-ప్రొఫైల్ లో ప్రమోషన్ చేస్తోందంటూ వచ్చిన కథనాలను సమర్థించాడు మహేష్. మరోవైపు జీవ ఆయుధాలు కాన్సెప్ట్ స్పైడర్ లో లేదని, బయలాజికల్ వెపన్స్ ప్రస్తావన ఉండదని స్పష్టంచేశాడు. 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో 190 రోజుల పాటు రాత్రిపగలు కష్టపడి చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మహేష్.