Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జైలవకుశ టార్గెట్ @ 30 కోట్లు

జైలవకుశ టార్గెట్ @ 30 కోట్లు

ఫస్ట్ 5 డేస్ రన్ ముగిసింది. జై లవకుశకు దొరికిన ఈ సోలో రన్ అరుదైనది. మూడు, నాలుగు వారాలుగా సరైన సినిమా లేకపోవడం, దసరా సెలవులు ప్రారంభం కావడం, దాదాపు థియేటర్లనీ ఒకే సినిమాకు దొరకడం వంటి చాన్స్ లు కలిసివచ్చాయి. వన్ డే బిఫోర్ గా విడుదలయి, లాంగ్ వీకెండ్ కలిసివచ్చింది. ఇలా టోటల్ గా ఆరు రోజులకు దగ్గర దగ్గర 55కోట్లు వరల్డ్ వైడ్ గా షేర్ సంపాదించింది. ఇది చిన్న విషయం కాదు. చెప్పకోదగ్గ కలెక్షనే. 

అయితే బుధవారం నుంచి స్పైడర్ విడుదలవుతోంది. ఆ తరువాత రెండు రోజులకు మహానుభావుడు విడుదలవుతుంది. ఇక సీజన్ ను షేర్ చేసుకోవాల్సిందే. ఈ సీజన్ ఇంకో వారం వుంటుంది. ఈ వారం అంతా కలిపి కనీసం మరో ముఫై కోట్లు వసూలు చేయాలి జై లవకుశ. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా జై లవకుశ థియేటర్ రైట్స్ అమ్మకాలే 86కోట్ల వరకు జరిగాయి. అంటే ఇంకా ముఫై కోట్లు రావాలి, పెట్టిన పెట్టుబడి బయ్యర్లకు వెనక్కురావాలంటే. ఆపైన కనీసం టెన్ పర్సంట్ ఖర్చులు రావాల్సివుంటుంది. ఈ ఫీట్ కనీసం 8 నుంచి పది రోజుల్లో సాధించాలి. 

వచ్చేవారం వీకెండ్ మీదనే ఆశలన్నీ. ఎందుకంటే దసరా మూడు రోజులు థియేటర్లు కిటకిట లాడతాయి. ఆ రోజుల్లో కనుక పది నుంచి పదిహేను కోట్లు సంపాదించగలిగితే బయ్యర్లు చాలా వరకు గట్టెక్కేస్తారు. లేదూ అంటే మాత్రం ఖర్చుల సంగతి అలా వుంచితే డెఫిసిట్ వచ్చే పరిస్థితి వుంటుంది. కానీ పండగ మూడురోజులు మాంచి కలెక్షన్లు వుంటాయని ఆశిస్తున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి లవకుశ పబ్లిసిటీ మరింత షురూ చేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర మరో మూడు కోట్లు, సీడెడ్ నాలుగు కోట్లు, నైజాం ఎనిమిది కోట్ల వరకు రావాల్సి వుంది. పండగ సీజన్ కు ఇది పెద్ద టార్గెట్ కాదని యూనిట్ అభిప్రాయం. ఈస్ట్ కు జస్ట్ ఓ కోటిన్నర వస్తే సరిపోతుంది. వెస్ట్ కు ఒకటిన్నర వరకు రావాలి. చూడాలి పండగ సీజన్ ఎలా వుంటుందో? నైజాం బయ్యర్ దిల్ రాజు మాత్రం ఈ పండగ సీజన్ జై లవకుశ బయ్యర్లను గటెక్కించేస్తుందని తన అనుభవంతో చెబుతున్నారట. చూడాలి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?