యంగ్ హీరో సినిమాకు కుర్రాళ్ల జడ్జిమెంట్

యూత్ అంటే యూత్ నే. ఎంత మనసు యంగ్ గా వున్నా కొన్ని యూత్ సినిమాలను మిడిల్ ఏజ్డ్ జనాలకు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. సినిమాల విషయంలో అపార అనుభవం వున్న అల్లు అరవింద్ కు…

యూత్ అంటే యూత్ నే. ఎంత మనసు యంగ్ గా వున్నా కొన్ని యూత్ సినిమాలను మిడిల్ ఏజ్డ్ జనాలకు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. సినిమాల విషయంలో అపార అనుభవం వున్న అల్లు అరవింద్ కు ఈ సంగతి బాగా తెలిసినట్లుంది. అందుకే ఆయన తన లేటెస్ట్ నిర్మాణం గీత గోవిందం సినిమాను నేరుగా మెగా కుటుంబంలోని యంగ్ బ్యాచ్ కు, యూత్ బ్యాచ్ కు ప్రత్యేకంగా చూపించేసారట.

తన కుటుబం, తన బంధువర్గంలోని యూత్ అండ్ యంగ్ బ్యాచ్ ను పిలిచి మరీ గీత గోవిందం సినిమా చూపించే ఏర్పాటు చేసారట. సినిమా ఎలా వుంది? ఎక్కడ నచ్చింది? ఇలాంటి ఒపీనియన్ అంతా తీసుకున్నారట. ఆ కుర్ర బ్యాచ్ కు సినిమాను తెగ నచ్చేయడంతో విడుదలకు ఇక ఓకె అని అరవింద్ చెప్పేసారట.

దేవరకొండ ‘సుందరకాండ’
భాగ్యరాజా కథతో వెంకీ చేసిన సినిమా సుందరకాండ. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఈ సినిమాలో హీరో లెక్చరర్.. హీరోయిన్ స్టూడెంట్. ఇప్పుడు అదే కథ కాదు కానీ, అదేతరహా పాత్రల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మడొన్న కనిపించబోతున్నారు.

ఈనెల15న విడుదల కాబోతున్న గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెసర్ అంట.. రష్మిక స్టూడెంట్ అంట. ఈ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రి గేమ్ మాంచి రసవత్తరంగా వుంటుందని తెలుస్తోంది.