యంగ్ హీరో డైరక్టర్ల వేట

సరైన డైరక్టర్ ను పట్టుకుని, మాంచి హిట్ కొట్టాలని ఓ యంగ్ హీరో కిందా మీదా అవుతున్నారట. ఇటీవల వరుసగా మూడు సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం ఒక సినిమా చేతిలో వుంది.…

సరైన డైరక్టర్ ను పట్టుకుని, మాంచి హిట్ కొట్టాలని ఓ యంగ్ హీరో కిందా మీదా అవుతున్నారట. ఇటీవల వరుసగా మూడు సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం ఒక సినిమా చేతిలో వుంది. అది పూర్తయ్యేలోగా మరో సినిమా పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారట. 

ఇటీవల మంచి హిట్ ఇచ్చిన కొత్త డైరక్టర్ లను స్వయంగా పిలిపించి, తనతో సినిమా చేయమని ఆఫర్ లు ఇస్తున్నారట. మంచి ప్యాకేజీలు కూడా ఆఫర్ ఛేస్తున్నారట. అయితే సహజంగా ఆ క్యాంప్ లోకి వెళ్లడానికి కొత్తగా ఇండస్ట్రీలో కాలు పెట్టిన డైరక్టర్లు జంకుతున్నారట. అందుకే అటు ఇటు చెప్పలేక కిందా మీదా అవుతున్నారట.