నాగార్జున-కళ్యాణ్ కృష్ణ కాంబినేషేన్ స్టార్ట్ కాబోతోన్న సినిమా బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ లాంటిది.
నాగ్-రమ్యకృష్ణ, నాగ్ చైతన్య-కృతిశెట్టి లీడ్ పెయిర్. మోనాల్ గుజ్జర్ స్పెషల్ రోల్. ఈ సినిమా ప్రాజెక్టును ముందుగానే జీ టీవీకి అప్పగించేసారని తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్-దేవాకట్టాల రిపబ్లిక్ సినిమా మాదిరి డీల్ తో బంగార్రాజు సినిమాను కూడా జీ టీవీకి ఇచ్చేసారని బోగట్టా.
అంటే మొత్తం ఫండింగ్ అంతా విడుతల వారీగా జీ టీవీ నుంచే వస్తుంది. సినిమా ముందుగా అనుకున్న ప్రాజెక్టు ప్రకారం చేసి వాళ్లకు ఇవ్వాల్సి వుంటుంది.
జీటీవీ థియేటర్ హక్కులను విక్రయించి, మిగిలిన హక్కులు తనకే వుంచుకుంటుంది. ఈ ప్రాజెక్టులో మిగిలే మార్జిన్ నిర్మాతకు లాభంగా వుంటుంది. ఓ విధంగా సేఫ్ బెట్ అన్నమాట.