Advertisement

Advertisement


Home > Movies - Movie News

భారీ బడ్జెట్ సినిమాకు 1+1 ఆఫర్

భారీ బడ్జెట్ సినిమాకు 1+1 ఆఫర్

అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఎప్పుడూ ఊహించని విధంగానే ఉంటుంది. అతడి సినిమాలు హిట్టయితే ఒకేసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరతాయి. ఫ్లాప్ అయితే మాత్రం దారుణంగా వసూళ్లు వస్తాయి. అతడి తాజా చిత్రం ఈ రెండో కోవలోకి చేరింది.

అక్షయ్ కుమార్ తాజా చిత్రం బడే మియా ఛోటా మియా. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలుండేవి. అక్షయ్-టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సినిమా కావడం, రంజాన్ పండగ కలిసిరావడం, ట్రయిలర్ హిట్టవ్వడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి.

అయితే అంచనాలు వేరు, వాస్తవాలు వేరు అనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుందనుకున్న ఈ సినిమాకు విడుదలైన 3 రోజుల్లో కేవలం 32 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది.

సినిమాకు మీడియాలో హైప్ ఇచ్చారు తప్ప ప్రేక్షకుల్లో అంత బజ్ లేదనే విషయం మొదటి రోజు వసూళ్లతోనే తేలిపోయింది. ఈ సినిమాకు కేవలం 15.65 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు వసూళ్లు 50శాతం పడిపోయాయి. శనివారం వసూళ్లు కాస్త పెరిగినప్పటికీ అప్పటికే సినిమా తేలిపోయింది.

మూడో రోజైన శనివారం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కేవలం 18.27 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే కనిపించిందంటే, రిజల్ట్ ఊహించుకోవచ్చు. చెన్నైలో అత్యధికంగా 27శాతం ఆక్యుపెన్సీ కనిపించగా.. జైపూర్, ముంబయి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈరోజు ఈమాత్రం ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు.

ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ మళ్లీ సక్సెస్ అందుకోలేకపోయాడు. అతడి సినిమాలు హిట్టయితే కళ్లముందే వంద కోట్ల క్లబ్ లోకి చేరుతున్నాయి. ఫ్లాప్ అయితే మాత్రం ఓవరాల్ గా 50 కోట్లు కూడా రావడం లేదు. అంత దారుణంగా పోతున్నాయి. 

బడే మియా ఛోటా మియా పరిస్థితి కూడా అలానే ఉంది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, అందులో నాలుగో వంతు వసూళ్లు కూడా సాధించేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?