Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్ వ‌జ్రాయుధం

జ‌గ‌న్ వ‌జ్రాయుధం

ఎన్నిక‌లు స‌మీపించాయి. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ప్ర‌చారాన్ని ఉధృతం చేశారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జోష్ పెంచారు. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మిపై విజ‌యం సాధించ‌డానికి జ‌గ‌న్‌కు ఓ వ‌జ్రాయుధం దొరికింది. అదే కూట‌మి 2014 ఎన్నికల మేనిఫెస్టో. జ‌గ‌న్ ప్ర‌చారంలో ఈ మేనిఫెస్టో త‌ప్ప‌ని సరిగా వుంటోంది.

ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి విశ్వ‌సనీయ‌త దెబ్బ తీయ‌డానికి 2014 మేనిఫెస్టో అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. 2014లో చంద్ర‌బాబు ఇచ్చిన ముఖ్య‌మైన హామీల‌ను చ‌దువుతూ... ఇందులో ఏ ఒక్క‌టైనా అమ‌లు చేశారా? అని వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జానీకం నుంచే స‌మాధానం రాబ‌డుతున్నారు. రైతు, డ్వాక్రా రుణ‌మాఫీలు, అలాగే ఆడ‌బిడ్డ జ‌న్మిస్తే రూ.25 వేలు ఇస్తానన్న హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చారా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తుంటే... లేదు, లేదు అని జ‌నం నుంచి రీసౌండ్ వ‌స్తోంది.

అలాగే ఆంధ్రాను సింగపూర్ చేస్తాన‌న్నార‌ని, చేశారా? అంటూ జ‌గ‌న్ నిల‌దీయ‌డం ఆక‌ట్టుకుంటోంది. అలాగే అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించారా? అని జ‌గన్ ప్ర‌శ్న‌ల‌కు... కూట‌మి నుంచి స‌మాధానాలు నిల్‌. 2014లో ఈ మూడు పార్టీలే జ‌ట్టు క‌ట్టాయని ప‌దేప‌దే జ‌గ‌న్ గుర్తు చేస్తున్నారు. అధికారం కోసం చంద్ర‌బాబు ఏదైనా చెబుతార‌ని, కానీ ఏదీ చేయ‌రంటూ జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఇప్పుడు అలివికాని హామీలు ఇస్తున్న చంద్ర‌బాబును న‌మ్ముతారా? అంటే... లేద‌ని ప్ర‌జ‌ల నుంచి స‌మాధానం హోరెత్తుతోంది. చంద్ర‌బాబును ఆద‌రిస్తే సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని, త‌న‌ను అక్కున చేర్చుకుంటే కొన‌సాగుతాయ‌ని జ‌గ‌న్ చెబుతుంటే, ప్ర‌జ‌లు ఉత్సాహంగా ఔను, ఔను అంటున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ విశ్వ‌స‌నీయ‌త లేని నాయ‌కుల‌ని, వారి హామీలేవీ న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్ ఆధారాల‌తో స‌హా చాకిరేవు పెడుతుంటే, కూట‌మి నోర్మూసుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?