ఈ సమ్మర్ లో సరైన సినిమాలు పడలేదు. దసరా, విరూపాక్ష తరువాత సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప నిలబడిన దాఖలాలు లేవు. ఈవారం విడుదలైన అన్నీ మంచి శకునములే సినిమా క్లిక్ అవుతుందని అంతా ఆశపడ్డారు. కానీ సీన్ రివర్స్ లో వుంది. బిచ్చగాడు 2 మంచి ఓపెనింగ్ తీసుకుంది. శని, ఆది వారాలు ఎలా వుంటుందో చూడాలి. ఈ నెల 26 పెద్దగా సినిమాలు వుండవని అనుకున్నారంతా.
అందుకే మళ్లీ పెళ్లి సినిమాను అక్కడ వేసారు. నరేష్-పవిత్ర కలిసి నటించిన ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకుడు. సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ వుంది. బజ్ వుంది. ట్రయిలర్ కూడా క్లిక్ అయింది. కానీ దానికి పోటీగా చిన్న సినిమా మేము ఫేమస్ డేట్ వేసారు. నిర్మాతలు వైవిధ్యంగా ప్రచారం సాగించారు. కానీ తీరా ట్రయిలర్ వచ్చిన తరువాత అది కాస్తా జారిపోయింది. ట్రయిలర్ పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయింది.
ఇలాంటి టైమ్ లో మరో ఆసక్తికరమైన సినిమా 2018 ని అదే డేట్ కు విడుదల చేస్తున్నారు నిర్మాత బన్నీ వాస్. ఆయన మిత్రులు తీసుకున్నారు ఈ సినిమాను తెలుగులో పంపిణీకి. గీతా సంస్థ అటు మేము ఫేమస్ విడుదల చేస్తోంది. బన్నీ వాస్ 2018 బాధ్యతలు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి బయ్యర్ల వ్యవహారం ఇంకా ఫిక్స్ కాలేదు.
అంటే మొత్తం మూడు సినిమాలు 26న విడుదల కాబోతున్నాయి. అటు నరేష్-పవిత్ర, ఇటు ఆల్ రెడీ మరో భాషలో మంచి సినిమా అనిపించుకున్న 2018..ఈ రెండింటి మధ్యలో మేము ఫేమస్.