29న ‘రొమాంటిక్’ ‘వరుడు కావలెను’

పాపం, 'వరుడు' నాగశౌర్య టైమ్ అంత బాగున్నట్లు లేదు. ఈ నెల దసరా సందర్భంగా విడుదల కావాలి అనుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అడ్డం పడ్డాడు. ఎన్ని విధాల మొహమాట పెట్టాలో అంతా చేసారు. …

పాపం, 'వరుడు' నాగశౌర్య టైమ్ అంత బాగున్నట్లు లేదు. ఈ నెల దసరా సందర్భంగా విడుదల కావాలి అనుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అడ్డం పడ్డాడు. ఎన్ని విధాల మొహమాట పెట్టాలో అంతా చేసారు. 

అల్లు అరవింద్ మాట కాదని కొట్టే అవకాశం లేక, బంగారం లాంటి డేట్ అని తెలిసినా వెనక్కు వెళ్లిపోయారు వరుడు కావలెను నిర్మాతలు.

పోనీ ఈ నెల 29న విడుదల అనుకున్నారు. సోలో డేట్ దొరికిందనుకున్నారు. కానీ ఉరుము లేని పిడుగులా రొమాంటిక్ సినిమా వచ్చి పడింది. పూరి తనయుడు ఆకాష్ నటించిన సినిమాను ముందుగా నవంబర్ 4న విడుదల అనుకున్నారు. కానీ ఆ రోజు మామూలు కాంపిటీషన్ కాదు. నాలుగు సినిమాలు వున్నాయి.

రజనీ కాంత్ 'పెద్దన్న', మారుతి 'మంచి రోజులు వచ్చాయి', ఇంకా విశాల్ సినిమా వున్నాయి. రొమాంటిక్ కాస్తా కాస్త ముందుకు వచ్చేసింది. దాంతో వరుడు కావలెను సినిమాకు కాంపిటీషన్ తగిలింది. 

ఈ రోజులో మిడ్ రేంజ్ సినిమాలకు చాలా కష్టంగా వుంది. ఇక కాంపిటీషన్ అంటే మరీనూ. చూడాలి ఈ రేస్ లో ఎవరు విన్ అవుతారో?