2న నిశ్శబ్దం గ్లోబల్ ప్రీమియర్

కరోనా కారణంగా థియేటర్లకు జానెడు దూరంలో ఆగిపోయిన సినిమా నిశ్శబ్దం. అనుష్క-అంజలి-మాధవన్, అవసరాల, సుబ్బరాజు, షాలినీ పాండే నటించిన ఈ భారీ మిస్టర్ థ్రిల్లర్ ఎప్పటి నుంచో ఓటిటి ప్లాట్ ఫారమ్ లో వస్తుందని…

కరోనా కారణంగా థియేటర్లకు జానెడు దూరంలో ఆగిపోయిన సినిమా నిశ్శబ్దం. అనుష్క-అంజలి-మాధవన్, అవసరాల, సుబ్బరాజు, షాలినీ పాండే నటించిన ఈ భారీ మిస్టర్ థ్రిల్లర్ ఎప్పటి నుంచో ఓటిటి ప్లాట్ ఫారమ్ లో వస్తుందని వార్తలు వస్తూనే వున్నాయి. ఆఖరికి ఇప్పటికి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.

దాదాపు రెండు వందల దేశాల్లో అమెజాన్ ప్రయిమ్ లో నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 1 అర్థరాత్రి నుంచి ప్రసారమవుతుంది. నిశ్శబ్దం విడుదల అధికారిక ప్రకటన సందర్భంగా దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడుతూ “మేము ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుండి, సినిమా చూడటానికి అభిమానుల ఉత్సాహం స్పష్టంగా ఉంది. ఈ సినిమాను తెలుగు,తమిళ భాషల్లో సమాంతరంగా నిర్మించామని చెప్పారు''

హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ ''..నేను ఇప్పటివరకు పోషించిన అన్ని పాత్రలతో పోలిస్తే సాక్షి పాత్ర నాకు చాలా కొత్త అనిపించింది.. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర, నేను ఈ పాత్ర పోషించినందుకు సంతోషిస్తున్నాను. మాధవన్‌తో మళ్లీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది..'' అన్నారు. హీరో మాధవన్ మాట్లాడుతూ “నాకు థ్రిల్లర్ చిత్రాలను చూడటం ద్వారా చాలా ఇష్టం.. నిశ్శబ్దం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది.. ”అని  అన్నారు. 

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా?