త్రీ డీ లో హనుమాన్

డొమెస్టిక్ మార్కెట్‌లో హనుమాన్ సినిమా ఇంకా అంతో ఇంతో షేర్ రాబడుతోంది. దీన్ని మరింత పెంచి ఈ సమ్మర్ వరకు థియేటర్ రన్ ను నిలబెట్టేందుకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ప్లాన్…

డొమెస్టిక్ మార్కెట్‌లో హనుమాన్ సినిమా ఇంకా అంతో ఇంతో షేర్ రాబడుతోంది. దీన్ని మరింత పెంచి ఈ సమ్మర్ వరకు థియేటర్ రన్ ను నిలబెట్టేందుకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ప్లాన్ లే వేస్తున్నారు. అందులో కీలకమైనది అదనపు సన్నివేశాలు జోడించడం. 

ముఖ్యంగా హనుమంతుడు కనిపించే సీన్లు యాడ్ చేయడం. ఇవన్నీ ఎడిటింగ్ లో పక్కన పెట్టినవి. వీటిలో కొన్ని తీసి జోడించే ఆలోచన చేస్తున్నారు. దాంతో హనుమాన్ త్రీడీ వెర్షన్ ను అర్జంట్ గా తయారు చేయించి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

సినిమా విడుదలయిన తొలివారం నుంచే ఈ పనుల మీద వున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. నిజానికి ఫిబ్రవరి, మార్చి ల్లో సరైన సినిమాలు లేవు. ఆ గ్యాప్ ను వాడేసుకోవడానికి హనుమాన్ టీమ్ రెడీ అయిపోయింది. అప్పటి నుంచి ఓ టీమ్ ఇదే పని మీద వుంది.

హనుమాన్ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంది. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు కళ్ల చూసింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్ వచ్చి, అదనుపు హంగులు జోడిస్తే మరి కొన్ని కోట్లు రాబట్టడం ఖాయం.