‘విమానం’ ఎక్కుతున్న కొత్త సినిమాలు

ఉన్నట్టుండి సడెన్ గా 'విమానం' ఎక్కేసింది టాలీవుడ్. కొత్త కథలతో, కొత్త సినిమాలు వస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా కొన్ని సినిమాల నేపథ్యం పూర్తిగా విమానం కావడం విశేషం.  Advertisement రెండు రోజుల కిందట ఉస్తాద్…

ఉన్నట్టుండి సడెన్ గా 'విమానం' ఎక్కేసింది టాలీవుడ్. కొత్త కథలతో, కొత్త సినిమాలు వస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా కొన్ని సినిమాల నేపథ్యం పూర్తిగా విమానం కావడం విశేషం. 

రెండు రోజుల కిందట ఉస్తాద్ అనే సినిమా టీజర్ వచ్చింది. శ్రీసింహా హీరోగా నటించిన ఈ సినిమాలో విమానమే కీలకాంశం. టీజర్ ప్రారంభమవ్వడమే విమానంతో మొదలవుతుంది. ఓ సామాన్యుడు, పైగా పైకి వెళ్తే కళ్లుతిరిగే సమస్య ఉన్న ఓ వ్యక్తి ఎలా పైలెట్ అయ్యాడనేది ఈ సినిమా స్టోరీ. లవ్ యాంగిల్ ఉన్నప్పటికీ, మెయిన్ ప్లాట్ మాత్రం విమానమే. 

తాజాగా సముద్రఖని లీడ్ రోల్ లో నటిస్తున్న ఓ సినిమా టీజర్ రిలీజైంది. ఈ సినిమా పేరే విమానం. ఒక విమానం, అతడికి ఓ కొడుకు. కొడుక్కి విమానం ఎక్కాలనే కోరిక. బాగా చదువుకుంటే విమానం ఎక్కొచ్చంటాడు తండ్రి. ఇలా సాగుతుంది ఈ సినిమా. 

ఇక ముచ్చటగా మూడో సినిమా. దీని పేరు ప్రేమ విమానం. ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు చిన్న పిల్లలు, అర్జెంట్ గా ఫ్లయిట్ ఎక్కి తమ కొత్త జీవితం ప్రారంభించాలనే ఆత్రుతలో ఓ ప్రేమ జంట, ఓ విమాన ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు.. ఇలా విమానం చుట్టూ సాగే కథ ఇది.

ఇలా ఒకే సీజన్ లో విమానం చుట్టూ తిరిగే కథలతో ఏకంగా 3 సినిమాలు వస్తున్నాయి. కథల పరంగా ఈ సినిమాల మధ్య తేడాలుండొచ్చు, ఆర్టిస్టులు కూడా వేర్వేరుగానే ఉన్నారు. కానీ కోర్ పాయింట్ మాత్రం విమానమే. గతంలో ఒకే ప్లాట్ తో సినిమాలొచ్చిన సందర్భాలున్నాయి. 

ఉదాహరణకు సాహో, అజ్ఞాతవాసి సినిమాలనే తీసుకుంటే, ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఒకటే. కొన్ని ప్రేమకథలు కూడా ఇలానే వచ్చాయి. ఇప్పుడు విమానం కాన్సెప్ట్ తో 3 సినిమాలు రెడీ అవుతున్నాయి.