30న పవన్ సినిమా ఓపెనింగ్

ముచ్చటగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే సగంలో వున్న హరిహరవీరమల్లు అలాగే వుంది. మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ సినిమా పూజ చేసి వుంచారు. అది అలా వుంది. …

ముచ్చటగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే సగంలో వున్న హరిహరవీరమల్లు అలాగే వుంది. మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ సినిమా పూజ చేసి వుంచారు. అది అలా వుంది. 

ఇంకో పక్కన పీపుల్స్ మీడియా సినిమా కూడా వుండనే వుంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఈ సినిమాలో. అసలు ఏ సినిమా పూర్తి చేయకుండా ప్రతీదీ కొబ్బరికాయ కొట్టించేయడంలో పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు ఫ్యాన్స్ కు, సినిమా జనాలకు కూడా.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ నెల 30న పవన్ కళ్యాణ్-డివివి దానయ్య-సుజీత్ సినిమాకు పూజ చేసేస్తున్నారు. ఈ సినిమా సెట్టింగ్ వెనుక దర్శకుడు త్రివిక్రమ్ బలంగా వున్నారని టాక్ వుంది. హరీష్ శంకర్-మైత్రీ సినిమాకు ఆయనే అడ్డం అనే టాక్ కూడా వుంది. అలాంటి నేపథ్యంలో మైత్రీ సినిమా పూజ జరిగి వుండగా, సుజిత్ సినిమాకు పూజ జరిపించేయడం పై రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఆంధ్రలో ఎన్నికల వేడి వుంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. వారాహి వాహనం పూజలు జరిగిపోయాయి. మరి అటు రాజకీయ రంగంలో దూకకుండా, సినిమాల మీద సినిమాలకు పూజలు జరిపించడం, నిర్మాతలను, దర్శకులను అలా వెయిటింగ్ లో వుంచేయడం అంటే ఏమనుకోవాలో? 

పాపం, పవన్  కోసం అలా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ, పవన్ కోట్లు అడ్వాన్స్ లు తీసుకుంటూ వుంటే, ఈ దర్శకులు మాత్రం వేరే సినిమాలు చేయలేక, ఏళ్లకు ఏళ్లు ఖాళీగా వుంటూ కోట్లు పోగొట్టుకోవడం, ఎంత వరకు న్యాయమో పవన్ నే ఆలోచించుకోవాలి.