50 అడుగుల ప్రభాస్ కట్ అవుట్

తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, హాలోగ్రామ్ టెక్నాలజీ వాడి 50 అడుగుల హీరో కట్ అవుట్ ను ఏర్పాటు చేస్తున్నారు.  Advertisement తిరుపతిలో జరగబోయే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్…

తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, హాలోగ్రామ్ టెక్నాలజీ వాడి 50 అడుగుల హీరో కట్ అవుట్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

తిరుపతిలో జరగబోయే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెమరబుల్ గా వుండేలా డిజైన్ చేయడానికి తెరవెనుక సలహాలు, సూచనలు ఇచ్చింది డైరక్టర్ ప్రశాంత్ వర్మ. సెట్ మొత్తం అయోధ్య మాదిరిగా డిజైన్ చేస్తున్నారు. స్టేజ్ మొత్తం ఎల్ ఇడి స్టేజ్ గా డిజైన్ చేస్తున్నారు.

స్టేజ్ మీద ఆదిపురుష్ పాటలను ప్రదర్శిస్తారు. ఇందుకోసం వందలాది మంది సింగర్లు, డ్యాన్సర్లు పని చేస్తారు. మొత్తం ప్రోగ్రామ్ ను ఓ మంచి ఫీల్ గుడ్ కార్యక్రమంగా రూపొందిస్తున్నారు. అస్సలు సినిమా కార్యక్రమం మాదిరిగా కాదు. లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవు అవుతారని అంచనా వేస్తున్నారు.

చిన జీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక ప్రముఖులు రావడం, తిరుపతి లాంటి పట్టణంలో జరగడంతో ఈ కార్యక్రమం మొత్తం ఓ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. యువి సంస్థ, టి సిరీస్, పీపుల్స్ మీడియా లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు.