ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తయారవుతున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్ట్ కే నైజాం హక్కులు 70 కోట్లకు ఎన్ ఆర్ ఎ ప్రాతిపదికన ఆసియన్ సునీల్ సిండికేట్ కు ఇస్తున్నారు అన్న వార్తను నిన్న బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇవ్వడం వరకు నిజమే. కానీ అది 70 కోట్లకు కాదు 80 కోట్లకు అంటూ వివరణ ఇస్తున్నాయి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు. ప్రాజెక్ట్ కే అత్యంత భారీ వ్యయంతో తయారవుతున్న చిత్రమని, దీన్ని 70 కోట్ల రేషియోలో నైజాం ఇస్తే వర్కవుట్ కాదని అంటున్నారు.
గతంలో ఆర్ఆర్ఆర్, కేజిఎప్ 2 లాంటి చిత్రాలు నైజాంలో 70 కోట్ల రేషియోలోనే ఇచ్చారు. కానీ అవి అంతకు మించి వసూళ్లు సాగించాయి. అందువల్ల ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె ను 70 కోట్ల రేషియోలో ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇవ్వడం వరకు ఫిక్స్ అయిందని, రేటు దగ్గర మాత్రం ఇంకా బేరాలు సాగుతున్నాయని, ఫిగర్ 80 కోట్ల వరకు వుండొచ్చని క్లారిటీ ఇస్తున్నారు.
కానీ ఎంత ఇచ్చినా, ఎలా ఇచ్చినా ఎన్ ఆర్ ఎ సిస్టమ్ కాబట్టి ఫిగర్ అన్నది పెద్దగా సమస్య కాబోదు. కానీ ఎటొచ్చీ ముందుగా ఎంత అడ్వాన్స్ ఇస్తారు. దానికి వడ్డీలు ఎంత కట్టుకోవాల్సి వుంటుందన్నది కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వుంటుంది. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు ఈ సినిమాను. 2024లో విడుదలకు సిద్దం అవుతుంది.