72 మంది ఆర్కెస్ట్రాతో టీజర్ ఆర్ఆర్

సంగీత దర్శకుడు థమన్ కు అఖండ సినిమా ఆర్ఆర్ కు భయంకరమైన పేరు వచ్చేసింది. అమెరికాలో స్పీకర్లు బద్దలైపోయాయి. అప్పటి నుంచి సినిమా లవర్స్ థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు ఫ్యాన్స్ అయిపోయారు. …

సంగీత దర్శకుడు థమన్ కు అఖండ సినిమా ఆర్ఆర్ కు భయంకరమైన పేరు వచ్చేసింది. అమెరికాలో స్పీకర్లు బద్దలైపోయాయి. అప్పటి నుంచి సినిమా లవర్స్ థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు ఫ్యాన్స్ అయిపోయారు. 

ఇప్పుడు మళ్లీ బాలయ్య సినిమాకు థమన్ పని చేస్తున్నారు. భగవంత్ కేసరి అనే ఈ సినిమా టీజర్ రేపు విడుదలవుతోంది. ఈ టీజర్ తోనే తన ఆర్ఆర్ పని తనం చూపించాలని థమన్ ఫిక్స్ అయిపోయాడు.

థమన్ కు లైవ్ ఆర్కెస్ట్రా అంటే చాలా ఇష్టం. ఆర్ఆర్ కు చాలా వరకు ఇలాగే వాడతారు. కానీ ఫస్ట్ టైమ్ ఓ టీజర్ కు కూడా 72 మందితో లైవ్ ఆర్కెస్ట్రా నిర్వహించాడట. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా, క్వాలిటీ ప్రొడెక్ట్ కోసం చూడడంతో, థమన్ కూడా అదే దోవలో వెళ్లి ఆర్ఆర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఆర్ఆర్ ఏ మేరకు అలరిస్తుందో రేపు వచ్చే టీజర్ చెబుతుంది. స్పీకర్లు మళ్లీ బద్దలే అవుతాయో, ఇంకేం జరుగుతుందో. దాదాపు 108 థియేటర్లలో ఈ టీజర్ ను ప్లే చేయబోతున్నారు. అనిల్ రావిపూడి ఇంటెన్సివ్ మేకింగ్, సాహు గారపాటి ఖర్చు, థమన్ శ్రమ ఈ మూడూ టీజర్ లో తెలుస్తాయి.