ఒకప్పటి అమీర్ పేట సత్యం థియేటర్ ఇప్పుడు మాల్ గా, మల్టీ ఫ్లెక్స్ గా మారిపోయింది. ఆసియన్ మాల్ గా మారిన ఈ థియేటర్ టాప్ ఫ్లోర్ లో హీరో బన్నీ భాగస్వామ్యంతో ఎఎఎ సినిమాస్ మల్టీ ఫ్లెక్స్ రూపుదిద్దుకుంది. ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ ఈ నెల 16 నుంచి జనాలకు అందుబాటులోకి వస్తోంది.
ఈనెల 14న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15న అల్లు అర్జున్ మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభిస్తారు. 16న థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించడంతో ఈ మల్టీ ఫ్లెక్స్ ప్రారంభమవుతుంది. బన్నీ థియేటర్లో ప్రభాస్ సినిమా అంటూ ఇరువైపుల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
సత్యం థియేటర్ చాలా కీలక ప్రదేశంలో వుంది. విపరీతమైన ఫ్లొటింగ్, సినిమా లవర్స్ ఎక్కువగా వుండే ఏరియా ఇది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా అటు పంజాగుట్ట పివిఆర్ వైపు వెళ్తోంది. ఇక ఇప్పుడు మళ్లీ ఎఎఎ వైపు వచ్చే అవకాశం వుంది. ఈ మల్టీ ఫ్లెక్స్ లో మొత్తం అయిదు స్క్రీన్ లు వున్నాయి.