హిట్ 3.. చాలా పెద్ద ప్లానింగ్ ఇది

హిట్ సినిమా ఫ్రాంచైజీని ఎవెంజర్స్ టైపులో మార్చేస్తామని దర్శకుడు శైలేష్ కొలను ఇదివరకే స్పష్టం చేశాడు. ఎవెంజర్స్ సినిమాల్లో ఎలాగైతే ఒకేసారి ఇద్దరు ముగ్గురు సూపర్ హీరోస్ కనిపిస్తారో, రాబోయే హిట్ సిరీసుల్లో కూడా…

హిట్ సినిమా ఫ్రాంచైజీని ఎవెంజర్స్ టైపులో మార్చేస్తామని దర్శకుడు శైలేష్ కొలను ఇదివరకే స్పష్టం చేశాడు. ఎవెంజర్స్ సినిమాల్లో ఎలాగైతే ఒకేసారి ఇద్దరు ముగ్గురు సూపర్ హీరోస్ కనిపిస్తారో, రాబోయే హిట్ సిరీసుల్లో కూడా ఇలానే ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారన్నమాట. ఇంకో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ అనుకోవచ్చు.

హిట్-3లో నాని హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. హిట్-2 క్లైమాక్స్ లోనే ఆ విషయాన్ని బయటపెట్టారు. నానిని పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా పరిచయం చేశారు. సో.. హిట్-3లో నాని పక్కా. అయితే నానితో పాటు విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉంది.

కొద్దిసేపటి కిందట విశ్వక్, నాని, అడివి శేష్ తో దిగిన ఫొటోను షేర్ చేశాడు శైలేష్. హిట్-3 కోసం పెద్దదే ప్లాన్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశాడు. ఈసారి సినిమా మేసివ్ గా ఉండబోతోందనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.

అక్కడితో ఆగకుండా హిట్-3 సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రతో నెక్ట్స్ లెవెల్ ర్యాంపేజ్ క్రియేట్ చేయబోతున్నానని, ఇది నా వాగ్దానం అంటూ మరో పెద్ద స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఈ స్టేట్ మెంట్స్, ఫొటోలు కలిపి చూస్తే.. హిట్-3లో ఈ ముగ్గురు హీరోలు కనిపిస్తారని అనుకోవాలేమో .