ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఏంటనేది ఫిక్స్ అయింది. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాలు ఫిక్స్ చేశాడు. మరి అదే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం మాత్రం కష్టం. ఎందుకంటే చరణ్ లిస్ట్ లో ఇప్పుడు చాలామంది దర్శకులున్నారు. కానీ ఎవ్వరూ ఇంకా అఫీషియల్ గా లాక్ అవ్వలేదు.
ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్-కొరటాల కాంబినేషన్ లో సినిమా వస్తుందని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం చరణ్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. లిస్ట్ లో సురేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీళ్లందరితో పాటు ఓ కొత్త వ్యక్తి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.
అవును.. రామ్ చరణ్ లిస్ట్ లో సతీష్ అనే ఓ కొత్త కుర్రాడు కూడా ఉన్నాడు. ఇతడు చెప్పిన ఓ స్టోరీలైన్ చరణ్ కు బాగా నచ్చిందంట. దీంతో ప్రస్తుతం తన స్టోరీలైన్ కు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో సతీష్ ఉన్నాడు. ఉన్నట్టుంచి చరణ్ లిస్ట్ లో కనిపిస్తున్న ఈ “అజ్ఞాతవాసి” ఎవరా అని అంతా ఆరాలు తీస్తున్నారు. చరణ్ మాత్రం ఈ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నాడు.
ఇటు ఆర్ఆర్ఆర్ లో నటిస్తూనే, మరోవైపు ఆచార్య ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు చరణ్. వీటిలో ఆర్ఆర్ఆర్ కంటే ఆచార్య సినిమా త్వరగా కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత తను నెక్ట్స్ సినిమాపై ఈ హీరో ఓ నిర్ణయం తీసుకుంటాడు. చెర్రీ లిస్ట్ లో ఉన్న ఆ అజ్ఞాతవాసి ఎవరో అప్పుడు తెలిసే ఛాన్స్ ఉంది.