ఈ సినిమాకే 28 కోట్లు ఖర్చు?

రంగ రంగ వైభవంగా సినిమా విడుదలైంది. ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అదంతా ఓకె. కానీ ఈ సినిమా చూసిన వారికి పెద్దగా ఖర్చు పెట్టలేదు అన్న ఫీల్ కలిగింది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ భాగం…

రంగ రంగ వైభవంగా సినిమా విడుదలైంది. ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అదంతా ఓకె. కానీ ఈ సినిమా చూసిన వారికి పెద్దగా ఖర్చు పెట్టలేదు అన్న ఫీల్ కలిగింది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్ చేసారు. కొద్దిగా అవుట్ డోర్ షూట్ చేసారు. అందువల్ల సినిమాకు పెద్దగా ఖర్చు అయి వుండదని, నిర్మాత నష్టపోయి వుండరని భావించారు.

కానీ విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం వడ్డీలు, పబ్లిసిటీ అంతా కలిపి రంగ రంగ వైభవంగా సినిమాకు 28 కోట్లు వరకు ఖర్చయిందని తెలుస్తోంది. నాన్ థియేటర్ ఆదాయం 21 కోట్లు వచ్చింది. మిగిలిన ఏడు కోట్ల మేరకు థియేటర్ నుంచి రావాల్సి వుందట. ఆంధ్ర ఆరు కోట్ల మేరకు మార్కెట్ చేసారు. నైజాం ఓన్ రిలీజ్ చేసుకున్నారు.

సినిమాకు ఇలా ఎక్కువగా ఖర్చు అయిపోవడానికి వడ్డీల భారమే ఎక్కువ అని తెలుస్తోంది. సినిమా రెడీ అయిపోయినా విడుదల డేట్ వెంటనే దొరక్క పోవడంతో వడ్డీల భారించి సినిమాను హోల్డ్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. అలాగే టీమ్ ను చాలా ఊళ్లు ప్రచారానికి టూర్ తిప్పడానికి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయిందని తెలుస్తోంది. అలాగే హీరో ఆసక్తి పర్చడంతో నగరం పరిథిలో లాలీపాప్స్, మెట్రో పిల్లర్లపై ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేసారని తెలుస్తోంది.

దేవీశ్రీప్రసాద్ ను తీసుకోవడంతో కాస్త ఎక్కువ రెమ్యూనిరేషన్ నే ఇవ్వాల్సి వచ్చింది. స్టార్ కాస్ట్ కూడా కాస్త వుండడంతో రెమ్యూనిరేషన్లు పద్దు ఎక్కువే అయింది. మొత్తం మీద ఆరు కోట్ల డెఫిసిట్ తో విడుదలైన రంగ రంగ వైభవంగా థియేటర్ నుంచి రెండు కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా. అంటే మొత్తం మీద సినిమాకు అయిదు కోట్ల వరకు నష్టం తప్పకపోవచ్చు అని తెలుస్తోంది.