దాదాపు నాలుగేళ్లు దాటిపోతోంది. ఛల్ మోహనరంగా సినిమా వచ్చి. రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా మారాడు. అటు త్రివిక్రమ్ ఇటు పవన్ ఇద్దరూ సమర్పకులుగా కొమ్ము కాసినా బజ్ రాలేదు. పైగా సినిమా దారుణంంగా విఫలమైంది బాక్సాఫీస్ దగ్గర.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగానే వున్నారు కృష్ణ చైతన్య. మరో సినిమా చేతిలోకి రావడానికి ఇంతకాలం పట్టింది. గమ్మత్తేమిటంటే దాదాపు కృష్ణ చైతన్య మాదిరిగానే హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ డేట్ లు ఇవ్వడం.
పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమా కన్నా ముందు పవర్ పేట అనే సినిమా మూడు భాగాలుగా చేయాలని కృష్ణ చైతన్య అనుకున్నారు. అది ఛల్ మోహన్ రంగా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నక ముందు మాట. అప్పట్లో ఆ విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మరి ఆ సినిమానే ఒక భాగంగా చేస్తున్నారో, లేక వేరే సబ్జెక్ట్ నో మొత్తానికి శర్వానంద్ ను ఒప్పించారు.
ఈ సినిమాకు ఈ సోమవారం పూజ చేస్తున్నారు. త్వరలో సెట్ మీదకు వెళ్తుంది. ఒకే ఒక జీవితం తరువాత శర్వానంద్ చేస్తున్న సినిమా ఇదే. ఫుల్ గా మేకోవర్ అయిన తరువాత చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే.